Sunday 2 November 2014

తుది నిర్ణయం మీదే



నా పేరు నరసింహులు. నా వయస్సు 50 సమవత్సరాలు. 50 ఏండ్లు అపమార్గాన జీవించిన నేను ముదిమికి చేరుకునే థలో సత్యాన్ని గ్రహించాను. ఇస్లాం అంటే శాంతి, విధేయత, సమర్పణ అని తెలుసుకున్న నేను అన్ని విధాల నా జీవితాన్ని ఆ సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌ాకు అంకితం చేశాను. ఇకమీదట నా జీవనం, నా మరణం, నా ప్రార్థన, నా త్యాగం అన్నీ సర్వోన్నతుడైన అల్లాహ్‌ాకే అర్పితం.
 ఇస్లాం అదో విశ్వజనీన ధర్మం. అది మనిషిని దైవభితిని, నైతిక రీతి ప్రబోధించి అతన్ని గొప్ప ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దుతుంది. అతనిలో గొప్ప పరివర్తనను తిసుకువచ్చి అతని ఇహపరాల సాఫల్యానికి పూబాట వేస్తుంది. దానికనుగుణంగా నడుచుకునే వారికి అది నిజమైన గౌరవాన్ని ప్రసాదిస్తుంది. మానవులందరి ధర్మమైన ఇస్లాం ఒక్కటే, దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌ ఒక్కటే, అందరి ఆరాధ్య దైవం అల్లాహ్‌ా ఒక్కడే. మానవులంతా ఒక్కటే.
  పూర్వాశ్రమం గురించి చెప్పాలంటే – అగ్ర వర్ణాలవారు క్రింది వర్ణ జనులతో, దళితులతో కలిసి కూర్చోవడంగానీ, కలిసి భోంచేయడంగానీ ఈ ఆధునిక యుగంలో సైతం చేయరాదు. పైగా అలా చేసేవారిని అసహ్యించుకునేవారూ లేకపోలేదు. ఇస్లాం ప్రకారం అయితే మనిషిని గౌరవించడం, మర్యాదలు చేయడం ఎలాంటి తారతమ్యం పాటించకపోవడం తప్పనిసరి. ఇక్కడ వర్ణ భేదాలు లేవు. కుల పిచ్చీ లేదు. వంశ డాంబీకాలూ లేవు. ఎవరూ పుట్టుక రీత్యా అల్పులు కాదు. మనిషి చేసుకున్న కర్మల్ని బట్టే అతని స్థానం ఏర్పడుతుంది. అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించేవారే, అందరూ దైవ దాసులే, దైవానికి చెందినవారే, సమానులే.
  ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించిన మరుక్షణం అతనిలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అతనిపై రెండు బాధ్యతలు మోపబడతాయి.
1) బహుదైవారాధనను త్రోసిపుచ్చటం. 2) దేవుని ఏకత్వాన్ని స్వీకరించటం. జీవితపు అన్నీ రంగాల్లో ఆయన ఆదేశాలను నిర్వర్తించటం. ఏకేశ్వరుడు చేయమన్న దానిని చేయాలి. వద్దన్న వాటిని విసర్జించాలి. అలా మనం చేసిన నాడు దైవానికి ప్రీతిపాత్రులై స్వర్గంలో మహా ప్రవక్త (స) వారి సాంగత్యాన్ని పొందే సౌభాగ్యాన్ని సొంతం చేసుకున్నవాళ్ళం అవుతాము. ఒక వర్గం స్వర్గానికి వెళితే, మరో వర్గం నరకానికెళుతుంది. ఎటు వెళ్ళాలో మీరే నిర్ణయించుకోండి. ఈ జీవితం మీది. దీన్ని సార్థకం చేసుకుంటారో, వృధా పర్చుకుంటారో మీ ఇష్టం. ధర్మంలో మాత్రం ఎలాంటి బలాత్కారం, బలవంతం లేదు.

నా సత్యాన్వేషణ


అనంత కరుణామయుడు, అపార కృపాశీ లుడు, అనంత శక్తిమంతుడు సకల లోకాలకు ప్రభువు అయిన అల్లాహ్‌ా పేరుతో మొదలు పెడుతున్నాను.
నా పేరు నేరెళ్ళ రాజశేఖర్‌, తండ్రి పేరు నాగేశ్వర రావు. తల్లి పేరు శశికళ డేవిడ్‌. మాది సనాతన క్రిష్టియన్‌ సంప్రదాయ కుటుం బం. మా సొంత ఊరు కర్నూలు జిల్లా చాగల మర్రి మండలం, చింతలచెరువు గ్రామం. కోలుముల పేటకు ఆనుకొని ఉన్న క్రిష్టియన్‌ కాలనీలో బ్రిటిష్‌ వారు కట్టించిన చర్చీ ఉన్నది. అక్కడ ఉన్న వారందరినీ సంఘంగా చేశారు. ఆ సంఘంలో పేరున్న కుటుంబం మాది. ఎందుకంటే మా నాన్నగారు ఆర్మీలో రిటైర్డ్‌ అయిన తరువాత లోకల్‌ కరెంట్‌ ఆఫీస్‌ లో లైన్‌మెన్‌గా పని చేశారు. అందువలన మా అబ్బగారిని సంఘమయ్యగా ఎన్నుకొన్నారు ఊరి ప్రజలు. మేము చర్చీలో ప్రార్థన చేయించడమే కాక చావులకు, పెళ్ళిళ్ళకు ఇంటింటికీ వెళ్ళి ప్రార్థనలు చేయించేవాళ్ళం. నా చిన్నప్పుడు మా నానమ్మ చర్చీలో పాస్టర్‌గా పని చేశారు. నేను నానమ్మతో పాటు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుండే వాణ్ణి. నాకు ఊహ తెలిసిన తరువాత మా అబ్బ, నానమ్మ పాస్టర్‌ గా గతించారు. పెద్దయ్యాక మా అన్నకు, నాకు ఈ సంఘపు బాధ్యతలు అప్పగించ బడినాయి. నేను బాప్తిస్మా మరియు నిర్ధారణ తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. యెహోవా (అల్లాహ్ ) మెష్షే ప్రవక్త కు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలతో పాటు మరి కొన్ని ప్రార్థనలు వచ్చి ఉండాలి. ఆ ఆజ్ఞలతో మొట్టమొదటిది ”నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశమందే గానీ, క్రింద భూమియందే గానీ, భూమి క్రింద నీళ్ళయందే గానీ ఏ విగ్రహము అయిననూ గానీ నీవు చేసుకొనకూడదు. వాటిని పూజించకూడదు. వాటికి సాగిలపడ కూడదు” అన్నది. ఈ ఆజ్ఞయే నాలో ఆలోచన ను రేకెత్తించింది. నా మతం సరియైనదే అని నమ్మకం ఉన్నా ఏదో వెలితి నన్ను వేరే మతాలలోనికి తొంగి చూసేలా చేసింది. అందులో నన్ను ఇస్లాం ఆకర్షించింది.
ధర్మభ్రష్టుణ్ణి అవుతున్నానేమో అని ఒకవైపు, నిజమార్గమేమిటో తెలుసుకోవాలన్న తపన మరో వైపు ఎటూ తేల్చుకోలేక పోయేవాణ్ణి. అయినా ఇస్లాం వైపునే నా చూపు మాటి మాటికీ పోయేది. ఎందుకు ఇలా జరుగు తున్నది అని తరచి చూస్తే నా జీవితంలోని సంఘటనలు, నా పరిసరాలు, స్నేహితులూ అన్నింటినీ మించి అల్లాహ్‌ా కరుణా కటాక్షా లు నామీద ప్రభావం చూపి ఉండవచ్చు. అందులో కొన్ని అనుభవాలు మీతో పంచు కోవాలనుకుంటున్నాను.
మొట్టమొదటిది: నా తల్లిగారు నర్స్‌. ఉద్యోగం రీత్యా మేము చాలా ఊర్లు మార వలసి వచ్చేది. కడప జిల్లా సుండుపల్లెలో ఉండగా నేను చాలా చిన్నవాణ్ణి. ఒక సారి మా అమ్మ గారు అర్జెంట్‌ డ్యూటి మీద వెళుతూ మా పొరుగున ఉండే అజీజ్‌ ఖాన్‌ గారి భార్యకు నన్నప్పగించి వెళ్ళారు. ఆమెకు కూడా నా వయసు కుమార్తె ఉంది. నేను ఆకలితో ఏడ్చే సరికి తన బిడ్డకు పట్టవలసిన పాలను నాకు త్రాపినది ఆ మహాతల్లి. నాకు ఊహ తెలిసిన తరువాత నా తల్లిదడ్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఆమె త్యాగబుద్ధితో నాకు పాలు త్రాపించినందులన ఆ తల్లి వారసత్వం గా నాలో ఇస్లాం ప్రవేశించినదో లేక ఒక ముస్లిం మహిళ నాకు పాలు త్రాపినది అన్న కారణంగానో  తెలియదు గానీ ముస్లిమ్స్‌ అంటే నాకు చాలా అభిమానం ఏర్పడినది.
సుండుపల్లె నుండి ప్రమోషన్‌, ట్రాన్స్‌ఫర్‌ నిమిత్తం అమ్మగారు లక్కిరెడ్డిపల్లెకు మార వలసి వచ్చినది. అక్కడ అబ్బాస్‌ అలీ ఖాన్‌, అనే స్నేహితుడు పరిచమయ్యాడు. ఇతని ద్వారా ఇస్లాం వైపు నా ప్రయాణం మొదలై నది. తరువాత అమ్మకు కడపకు ట్రాన్స్‌ఫర్‌ అయినది. అక్కడికి పోయిన తరువాత అబ్బాస్‌ అలీ ఖాన్‌, తన చిన్నాన్న కుమారుడు నవాజ్‌ అలీ ఖాన్‌తో పరిచయం చేయించాడు, నవాజ్‌ స్నేహితులు నా స్నేహితులయ్యారు. అందులో బషీర్‌ ఖాన్‌ ఆనే స్నేహితుని ద్వారా నేను ఇస్లాంకు మరింత దగ్గరయ్యాను. నేను బషీర్‌తో ఇస్లాం స్వీకరిస్తానని చెప్పాను. మా ఇంటివారు గొడవ పడతారనే అనుమానంతో బషీర్‌ ఇప్పుడే వద్దు నీ కాళ్ళ మీద నీవు నిల
బడ్డ తరువాత ఇస్లాం స్వీకరిస్తువులే అని నచ్చ జెప్పాడు. బహుశా అప్పుడు ఇస్లాం స్వీకరించి ఉంటే నికలడ ఉండేది కాదేమో! ఎందుకంటే టీనేజీ తొందరపాటు నిర్ణయం మరియు నాకు ఇస్లాం గురించి తెలిసినది చాలా తక్కువ గనక.
తరువాత మేము సొంత ఊరుకు చేరు కున్నాము. అక్కడ చర్చీలో మా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారము. కొంతకాలం తర్వాత అన్నగారి లాయర్‌ ఉద్యోగం రీత్యా మరియు ఆయన చదువు రీత్యా మండల కేంద్రమైన చాగల మర్రికి మేమందరము రావలసి వచ్చినది. అక్కడ మొహిద్దీన్‌, అబ్దుల్లాహ్ , అహ్మద్‌, యాకూబ్‌ అనే స్నేహి తులు పరిచమయ్యారు. అదే నా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌. నవ యువకులలో ఉండే అన్ని లక్షణాలు వీరిలో ఉన్నా నమాజు సమయం కాగానే వీరందరూ మసీదుకు వెళ్ళేవారు. నేను నా కుటుంబ సభ్యులు ఆది వారం చర్చీకి వెళ్ళేవారం. ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన చేస్తుండేవారము. కానీ వీరిలా రోజూ 5 పూటల ప్రార్థన నా ఊహకందని విషయం. నాలో అలజడి మొదలయినది. ఎందుకంటే ఎంతో చిలిపిగా, ఉల్లాసంగా, జాలిగా గడిపే సమయంలో అజాన్‌ వినబడగానే వీరి ప్రవ ర్తన మారిపోయేది. ఏదో శక్తి వీరిని కమాండ్‌ చేస్తున్నట్లు నన్ను ఒంటరిగా వదిలేసి మసీదు కు వెళ్ళి పోయేవారు. ”ఇస్లాంలో నమాజుకు ఇంత ప్రాధాన్యత ఉందా? ఏ శక్తి వీరిని ప్రార్థన సమయంలో ప్రాపంచిక విషయాల నుండి ప్రార్థనా మందిరానికి తీసుకొని వెళుతు న్నది?” అన్న చింతన నాలో చిగుళ్ళు పోసు కుంది.  వారు నమాజు నుండి రాగానే మళ్ళీ సంతోషంగా కబుర్లలో పడేవారము. వీరు స్టూడెంట్స్‌ జమాఅత్‌ సభ్యులు (ఎస్‌ఐఒ)  అయినందు వలన ఇస్లాం గురించి, మరియు జమాఅతే ఇస్లామీ హింద్‌ ప్రోగ్రామ్స్‌, తబ్లీగ్‌ జమాఅత్‌ ఇజ్తిమాల గురించి కూడా మాట్లాడు కుంటూ వుండేవారు. నేను అవన్నీ వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయిత్నించేవాన్ని. ముఖ్యంగా అబ్దుల్లాహ్  మరియు యాకూబ్‌ చెప్పిన మాటలు నాలో సెన్స్‌ను, కామన్సెన్స్‌ను పెంచాయి.  ”యేసు దేవుడు కాదు, దైవ కూమారుడూ కాదు. ఆయన దైవ ప్రవక్త మాత్రమే. ఆయన చనిపోలేదు సజీవంగా పై ఆకాశాలలోకి లేపు కోబడ్డారు. తిరిగి వచ్చి ముహమ్మద్‌(స) ప్రవక్త వారి సముదాయంలోని ఓ వ్యక్తిగా రాజ్యపాలన చేస్తారు. అప్పుడు అత్యధిక శాతం మంది క్రైస్తవ సోదరులు సత్యం గ్రహించి దైవ ధర్మమైన ఇస్లాం ఛత్రఛాయల్లో వచ్చి చేరతారు” అన్న మాట  నాలోని సత్యార్తి మరింత పెంచింది.
బైబిల్‌లో కూడా యేసు ”నేను దేవుడని, నన్నే ఆరాధించండి అని ఎక్కడా చెప్పలేదు.” ఆయన ప్రతి పనిని సృష్టికర్త నామమునే చేసేవారు. సృష్టికర్తనే ఆరాధించేవారు. పాత నిబంధన చూసినట్టయితే యెహోవా ఇలా సెలవిచ్చెను: ”నీ దైవమైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండ కూడదు.”
ఈ ఆజ్ఞ ద్వారా యేసు (ఈసా అలై) దైవ ప్రవక్త మాత్రమే అని, దైవానుగ్రహం వలన ఆయన అద్భుతాలు చూపినంత మాత్రాన ఆయన దైవ కుమారుడు కాజాలడని గ్రహిం చాను. నా ఇంటిల్లిపాదికీ పదేపదే వివరిం చినా వారు విశ్వసించలేదు, నా మనసు మాత్రం విశ్వసించింది. నేను మసీదుకు వస్తానని నా స్నేహితులతో చెప్పాను. వారు ఒక ప్రోగ్రాంకు స్నానం చేసి రమ్మని ఆహ్వా నిస్తే జీవితంలో మొదటిసారి చాగలమర్రి మసీదులో అల్లాహ్  కృప వలన ప్రవేశిం చాను. అక్కడ ఇమామ్‌ మహబూబ్‌ సాహెబ్‌ గారి ప్రసంగంతో చాలా ప్రభావితమయ్యాను. తరువాత అప్పుడప్పుడూ జమాఅత్‌ ప్రోగ్రామ్స్‌ కు హాజరవుతుండేవాన్ని. మా ఇల్లు మసీదు కు ఆనుకునే ఉండేది. ప్రతి అజాను పిలుపు నాలో ఏదో అలజడి రేపేది. క్రమంగా సకల లోకాల సృష్టికర్త ఒక్కడే అని సృష్టికర్త నామ మునే హృదయంలో ఆరాధించే స్థితికి చేరుకున్నాను. అయితే నా ఆరాధనకు రూపు లేఖలు లేవు. ఇస్లాం స్వీకరించాలంటే కుటుంబ, ఆర్థిక, సామాజికంగా ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్‌ రావచ్చని వెనకంజ వేశాను.
కుటుంబ కలహాలు లేక ఆర్థిక కారణాలు కావచ్చు లేక నా స్నేహితులు బషీర్‌ఖాన్‌, ననాజ్‌ ఖాన్‌, అహ్మద్‌లు కువైట్‌లో ఉన్నందు వలనో నేను కూడా కువైట్‌కు వెళ్ళాలని నాలో కోరిక కలిగింది. అయితే 11 సంవత్సరాలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు అల్లాహ్‌ా కృప వలన నా ప్రయత్నం ఫలించి 5 జూన్‌ 2008లో కువైట్‌కు చేరుకున్నాను. ఎ.సి పని అయినందువలన బరువుతో బిల్డింగ్‌లు ఎక్కడం దిగడంతో నా కాలు వాపు వచ్చి ఆ పని వదిలేయవలసి వచ్చింది. ఈ మధ్య కాలంలో నా స్నేహితుని ద్వారా గీటురాయి, నెలవంక, నేను ఆరాధించే ఇస్లాం పుస్తకాలు నాకు అందినవి. అది చదివి మరింత జ్ఞానం పెరిగినది. ఎ.సి పని వది లేసిన తరువాత సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం కొరకు మాలియాలోని వారి ఆఫీసుకు వెళ్ళి మేనేజరు కోసం వెయిట్‌ చేస్తుండగా నా చూపు (ఐ పి సి ) వారి ఉచిత పుస్తకాల స్టాండ్‌ మీద పడింది.  సత్య ప్రియులకు అన్న కరపత్రాన్ని తీసుకున్నాను. అందులో యేసు (అ) గురించి ఉంది. యెహోవా అల్లాహ్‌ా ఒక్కడే అని తెలిసి నా కళ్ళలో ఆనంద భాష్పాలు. నా సంతోషానికి అవధులు లేవు. వెంటనే నా ఇంటికి ఫోన్‌ చేసి నా సత్యాన్వే షణ ఫలించిందని శుభవార్త తెలిపాను. సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగంలో చేరినాను.  అల్లాహ్  అని స్మరించడం మొదలు పెట్టాను. నాతోటి ఉద్యోగుల వెంట నమాజు చేస్తుండే వాణ్ణి. అయితే నమాజు ఎలా చేయాలో తెలియక తప్పులు చేస్తుంటే వారు చూసి నీవు చేస్తున్నది తప్పు అంటే ఇన్షాఅల్లాహ్  త్వరలో సరిదిద్దుకుంటానని చెప్పేవాడిని. అప్పుడు నేను చేసుకున్న దుఆ నాకు ఇప్పటికీ గుర్తు న్నది – ”ఓ అల్లాహ్! నిన్ను ప్రతిరోజూ సరైన రీతిలో ఆరాధించే భాగ్యాన్ని కలిగించు. అలాంటి వాతావరణం నాకు కల్పించు”.
నెల పూర్తయిందో లేదో అకామా తగిలి స్తామని ఉద్యోగంలో చేర్చుకున్న సెక్యూరిటీ కంపెనీ వారు అకామా ఇవ్వలేము అని మోసం చేశారు. ఇక గత్యంతరం లేని పరిస్థితులలో నాకు డ్రైవింగ్‌ తెలిసినందు వలన ఇస్మాయిల్‌ అనే స్నేహితుని ద్వారా సబా అల్‌ నాసిర్‌లోని ఒక కువైటీ ఇంటి డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాను. ఈ విధంగా దేవుడు నా మొరను ఆలకిస్తాడన్న విషయం అప్పుడు నాకు తెలియదు. నా సెలవుదినమైన ఒక జుమా రోజు మాలియాకు వెళుతుంటే నా స్నేహితుడు ఫోన్‌ రిపేర్‌ చేయించుకుని రమ్మని నాకు ఇచ్చాడు. అది చూపెడితే మాలియాలోని షాప్‌ వారు చైనా ఫోన్లు ఇక్కడ చెయ్యరు;    సూఖ్‌  వతనియాలో   పొమ్మని  చెప్పారు. బస్సు ఖర్చు ఎందకు అని కాలి నడకన పోతుంటే దారిలో ఐపిసి బోర్డు ఉన్న కార్యాలయం కనబడింది. బయట ఉచిత తెలుగు పుస్తకాల కోసం వెతుకుతుండగా ఒక వ్యక్తిలోనికి వెళ్ళు ఉంటాయని చెప్పాడు. మెట్లు దిగి ఆఫీసులోనికి వెళుతుంటే తెలుగు మాటలు నా చెవిన బడ్డాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఇస్లాం గురించి అల్లాహ్‌ా గురించి తెలుగులో వివరంగా చెబు తున్నారు. దీన్‌ విషయం అయినందువలన ధైర్యంగా క్లాస్‌ రోమ్‌లోనికి వెళ్ళాను. ప్రస్తుత నెలవంక ఎడిటర్‌ గారయినటువంటి సయ్యద్‌ అబ్దుస్సలాం ఉమ్రీ గారు పాఠం చెబుతు న్నారు. నన్ను ఎంతో ఆప్యాయంగా  స్వాగ తం పలికారు. అక్కడ చాలా మంది విద్యా ర్థులు ఉన్నారు. వారంతా న్యూ ముస్లిమ్స్‌ అని తరువాత తెలిసింది. సార్‌ గారు ‘ఐపిసి క్లాసులకు వస్తుండండి మారడానికి తొంద రేమీ లేదు’ అని ఇస్లాం గురించి బాగా అర్థ మయ్యే రీతిలో చెప్పారు. 2 శుక్రవారాలు క్లాసులకు హాజరయ్యాను. ఈ మధ్యలో డాక్టర్‌ జాకిర్‌ నాయక్‌ గారి ఇస్లాం ఔర్‌ ఈసాయియత్‌ డీవీడీలు చూసి మా ఇంటి వారికి ఫోన్‌ చేసి నేను ఇస్లాం స్వీకరిస్తున్నాని చెప్పాను. నీవు ఎప్తుడో స్వీక రించావు ఇప్పుడు కొత్తగా స్వీకరించడమే మిటని మా అమ్మ అన్నది.(ఆమే ఉద్దేశం ఏమంటే నేను ముందు నుండి ముస్లిం స్నేహితులతో ఎక్కువగా తిరుగుతుండే వాన్ని అందువలన అలా అన్నది).
సత్యాన్వేషణలో నా సుదీర్ఘ ప్రయాణం అల్లాహ్  అనుగ్రహం వలన ఫలించింది. నా మొదటి ప్రచార కార్యక్రమం నా ఇంటివారి తోనే మొదలు పెట్టాను. నా భార్యాపిల్లలు ఇస్లాం స్వీకరించారు. పిల్లలంటే చిన్నవారు కానీ భార్య మాత్రం నా పయనం నీతోనే అంటూ మనస్ఫూర్తిగా స్వీకరించింది. ఇప్పుడు నా భార్య పేరు షబానా పర్వీన్‌, పెద్ద కుమారుడు అబ్దుల్లాహ్‌ా, చిన్న కుమారుడు అఫ్జల్‌, పెద్ద కూతురు రుఖయ్యా, చిన్న కూతురు హఫ్సా.
ఇస్లాం అంటే శాంతి అని అందరూ అంటూంటే ఏమో అనుకునేవాణ్ణి. కానీ మేము ఇస్లాంలోనికి ప్రవేశించగానే నిజమని అర్థమయింది. నేను నా భార్య ముందు ఎప్పుడూ గొడవ పడే వారం. కానీ ఇప్పుడు మా జీవితంలో ప్రశాంతత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం నెలకొంది. నేను కార్గోలో పంపిన ఐపిసి వారి పుస్తకాలు, డీవీడీల వలన నా భార్య కూడా ఇస్లాం గురించి బాగా తెలుసుకున్నది. ఏదైనా భేదాభి ప్రాయాలు వచ్చినా ఖుర్‌ఆన్‌, హదీసు వెలు గులోనే మా సమస్యలు సింపుల్‌గా పరిష్కార మవుతున్నాయి. అల్లాహ్‌ా మరియు ఇస్లాం గొప్పతనం, మహత్యం చూడాలనుకుంటే ఆచరించి అయినా చూడాలి లేక చనిపోయి అయినా తెలుసుకోవాలి. చనిపోయిన తరువాత తెలుసుకుంటే ఫలితం ఉండదు కావున ఈ జీవితంలోనే ఆచరించి ఇహపర లోకాలలోని శాంతిని పొందుదాము రండి.
మనం ఇస్లాం స్వీకరించి పశ్చాత్తాప పడితే మన గత పాపాలను అల్లాహ్  క్షమిస్తాడు. అల్లాహ్ను సరియైన రీతిలో వేడుకుంటే ప్రవ క్తలకు, ప్రవక్త అనుచరులకు ఎలాగైతే సహా యం చేశాడో ఇన్షాఅల్లాహ్  మనకు కూడా మనం ఊహించని రీతిలో సహాయం చేస్తాడు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఉదా హరణగా నా కువైట్‌ జీవితంలోని ఒక సం ఘటన తెలియజేస్తున్నాను.
నేను ముస్లిం కాక ముందు ఒక వ్యక్తి వద్ద 100 దినార్లు అప్పు తీసుకోవలసి వచ్చింది. దానికి వడ్డీ 5 దీనార్లు. ఒకరోజు అతను అర్జంటుగా నాకు డబ్బు అవసరం పడింది. త్వరగా నా డబ్బు ఇవ్వాలి అని చెప్పాడు. మానవ ప్రయత్నంగా నా స్నేహితులకు అడిగాను కానీ ఎవరూ ఇవ్వలేక పోయారు. అవతల అతను రోజూ ఒత్తిడి చేస్తున్నాడు, నాకు ఏ దారి కనబడక మసీదులో నమాజు తర్వాత బాధాతప్త హృదయంతో ”నీవు తప్ప వేరే దిక్కు లేదని అల్లాహ్తో వేడుకున్నాను” నా దుఆ అయిపోయింది. మసీదులో ఓ మూలన ఒక కువైటీ ఉన్నాడు. అతను నన్ను పిలిచాడు, జేబులో చెయ్యి పెట్టి చాలా దినార్లు తీసి ఎంచుతున్నాడు. నేను మనసు లో  ఇలా  అనుకుంటున్నాను.  ఇంత డబ్బు  ఉన్న వ్యక్తి కనీసం నాకు 5 దినార్లు అయినా ఇవ్వకపోతాడా అని. కాని అతను కొన్ని దినార్లు నా చేతిలో ఉంచి వెళ్ళి పోయాడు. అవి లెక్క పెట్టి చూస్తే 110 దినార్లు. నా అవసరం కూడా కరెక్ట్‌గా అంతే. నా కళ్ళలో ఆనందభాష్పాలు! వెంటనే సజ్దా చేసి అల్లాహ్‌ా కు కృతజ్ఞతలు తెలుపుకొని వెంటనే అప్పు ఇచ్చిన వ్యక్తికి ఫోన్‌ చేసి పిలిచి అతని డబ్బు 110 దినార్లు ఇచ్చేసి ఋణ విముక్తుణ్ణయ్యాను.
అల్లాహ్  దయ వలన ఐపిసి వారి పుణ్యమా అని ఇస్లాం గురించి మరియు ఆరాధనా పద్ధతులు నేర్చుకున్నాను. ఐపిసి వారి తర పున ఉమ్రాకు వెళ్ళాను, తరువాత హజ్‌కు కూడా వెళ్ళాను. కొద్దికాలంలోనే అల్లాహ్‌ా దయ వలన ఇవన్నీ నెరవేరినవి. ఇందుకు అల్లాహ్‌ాకు, ఐపిసి వారికి, నా కఫీల్‌ జమాల్‌ సఅద్‌ సఖలాన్‌ అల్‌ అజమీ గారికి మరియు మా సార్‌ సయ్యద్‌ అబ్దుస్సలాం ఉమ్రీ గారికి, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అల్లాహ్‌ా వారికి ఇహపరలోకా లలో అనుగ్రహించుగాక!
ఇండియాలో అయితే ఇస్లాం స్వీకరించడం నిలకడగా ఉండటం మరియు ప్రచారం చేయటం ఇబ్బంది ఏమో కానీ అరబ్‌ కంట్రీ అయినందువలన ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐపిసి వారి కృషి చాలా ఉన్నది. అయితే సన్మార్గము పొందా లనే తపన మనలో కలుగనంత వరకు అల్లాహ్‌ా అనుగ్రహించడు. వారు ముస్లిమ్‌ అయినా సరే గైర్‌ ముస్లిం అయినా సరే.  భార్యాపిల్లలను, తల్లిదండ్రులను, స్నేహి తులను అందరినీ వదలి కువైట్‌కు వచ్చి డబ్బు పేరు ప్రఖ్యాతులు కూడబెట్టుకొని కొందరు, మరియు వ్యసనాలకు మనో వాంఛలకు బానిసలై దివాళ తీసి అపఖ్యాతి మూటకట్టుకొని కొందరు వెళుతుంటారు. కానీ అల్‌హమ్దులిల్లాహ్‌ా నేను మాత్రం ఇహ పరలోకాలలో విజయం సాధించే ఇస్లాం పొందగలిగాను. చివరగా నా సూచన ఏమి టంటే ఇస్లాం స్వీకరించాలని ఉన్నా- బంధువులు, సమాజం ఏమంటారో? మన భవిష్యత్తు ఏమవుతుందో? మన పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయో లేదో? అని మధనపడే నా సోదర సోదరీమణులారా! చిన్నచిన్న సమస్యలు కొద్దికాలం మాత్రమే. ప్రాపంచిక జీవితం ఎలా గడవాలన్నది మనం పుట్టుక ముందే అల్లాహ్  లిఖించాడు. కానీ పరలోకం ఎలా ఉంటుంది అనేది అల్లాహ్  ఆజ్ఞలు, ప్రవక్త సాంప్రదాయాన్ని మనం పాటించ డాన్ని బట్టి ఉంటుంది.   సకల శక్తి సంపన్నుడైన అల్లాహ్  అండ మనకు ఉండగా మనం దేనికీ భయపడనవ సరం లేదు. ఒక కఫీల్‌ గానీ, ఒక అధికారి గానీ మరెవరైనా మనకు అప్పజెప్పిన పని పూర్తి చేస్తే దాని ప్రతిఫలం దొరకవచ్చు దొరక్క పోవచ్చు. కువైట్‌లో ఎందరి అనుభ వాలు మనం వినలేదూ! కానీ ఎవరి చేతిలో నా జీవన్మరణాలు ఉన్నాయో ఆ అల్లాహ్‌ా సాక్షి! అల్లాహ్  చెప్పిన పని పూర్తి చేస్తే ప్రతి ఫలం ఇహపరలోకాలలోనూ తప్పక దొరు కును. పని పూర్తి చేయకపోతే శిక్ష కూడా తప్పక లభిస్తుంది. అసలు పని ఏమిటి? మనల్ని అల్లాహ్ను  ఎందుకు పుట్టించాడు? అని ఆలోచిస్తే ఖుర్‌ఆన్‌లో దీని సమాధానం దొరుకుతుంది.
”నేను మానవులను జిన్నాతులను నా ఆరాధన కొరకే పుట్టించాను”  (అజ్‌జారియాత్; 56)
”ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయండి అని ఆ జ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. అల్లాహ్‌ాను విశ్వసిస్తారు. ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉన్నట్లయితే, వారికే మేలు కలిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కాని వారిలో అధికులు అవిధేయులు”. (ఆలి ఇమ్రాన్‌ : 110)
ఈ ప్రపంచంలో మన అకామా ఎంతకాలం ఉంటుందో తెలియదు. మహా అయితే 60 లేక 70 సంవత్సరాలు. ఇందులో ఎన్ని సంవత్సరాలు వృధా అయ్యాయో మనం దరికీ తెలుసు. ఇక మిగిలిన కాలం అయినా పశ్చాత్తాప పడి అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్త (స) గారి సాంప్రదాయాలను పాటించి ఇహ లోకంలోనూ మరియు  పరలోకంలోనూ సుఖశాంతులు పొందుదాము. ఏ లక్ష్యం కోసం అల్లాహ్  మనల్ని పుట్టించాడో అది నెరవేరుద్దాం. ఇస్లాం స్వీకరిద్దాం, పాటిద్దాం. మరియు ఇతరులను కూడా ఆహ్వానిద్దాము. నా ప్రయత్నంగా నా స్వదేశంలోని ప్రజలను కూడా జాగృతం చేయడానికి జూన్‌లో సెలవు మీద ఇండియాకు వెళుతన్నాను. నా ప్రయత్నం ఫలించాలని దుఆ చేయండి. అల్లాహ్  అందరికీ సన్మార్గము ప్రసాదించుగాక ! ( ఆమీన్)

మనిషిగా మారిన ఒక దేవుడు



బుద్ధ  భగవానుని అవతారంగా రూపొందిన నేను 45 సంవత్సరాల పాటు సుఖ భోగాలలో జీవితం గడిపాను. ప్రజలు నాకు సాష్టాంగ పడేవారు. అలాగే వారు ‘నేను దేవుడిని’ అని నమ్మేవారు. అలాగే నేను కూడా నమ్మాను. నా జీవితంలోని 45 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని దైవత్వపు ముసుగు ధరించి బుద్ధ భగవానుని అవతారంగా, బుద్ధుడు 7 పర్యాయాలు తిరిగి జన్మించాడని, నేనూ వారిలోని ఒకడిగా ప్రకటించుకొని గడిపాను. ‘నేను ఏదైతే పలుకుతానో అది దేవుని వాక్కు’ అని ప్రకటించి ఉన్నాను. ఆ విషయం పట్ల నాకు విశ్వాసం కూడా ఉండేది. నేనే కాకుండా పసుపు పచ్చని దుస్తులు ధరించిన బౌద్ధ భిక్షువులందరూ అదే విధంగా విశ్వసించే వారు.

  ప్రపంచంలోకెల్లా బౌద్ధమతం సర్వోత్కృష్ట మైనదని నేను విశ్వసించేవాడిని. ఆ విశ్వాసంతోనే నేను ప్రపంచంలోని వివిధ దేశాలలో దానిని ప్రచారం చేశాను. తత్ఫలితంగా వందలాది దేశాల్లో నాకు శిష్యులు, సహాయకులు రూపొందారు.   నాస్వంత సోదరుడు నేటికీ ప్రపంచ  వ్యాప్తంగా ప్రసిద్ధుడైన బౌద్ధ సన్యాసి. అతడు అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌  నగరంలో ఉంటాడు. నేను దైవత్వపు వేషంలో కొనసాగుతూ ఉండిన కాలంలో ఒక ముస్లిం సోదరుడు, చెన్నయ్‌లో నివసించే నా శిష్యుడైన డాక్టర్‌ చయ్యప్పన్‌ అనే బౌద్ధ మతానుయాయి ద్వారా నాకు ఇస్ల్లాం ధర్మంతో పరిచయం కలిగింది.  అలాగే నాకు ఇస్లాంకు చెందిన కొన్ని పుస్తకాలు ఇవ్వబడ్డాయి. కానీ నేను వాటిని నిర్లక్ష్య ధోరణితో అధ్యయనం చేశాను. అయితే ఆ తర్వాత ఖుర్‌ఆన్‌, దైవ ప్రవక్త హజ్రత్‌ ముహమ్మద్‌ (స) జీవిత చరిత్రల అధ్యయనాన్ని నిరంతరాయంగా కొన సాగించాను. ఆ సమయంలో నా హృద యాంతరాలలో నా పాపాల పట్ల  పశ్చాత్తాప

 భావన చెలరేగింది. తత్ఫలితంగా దైవత్వపు ముసుగులో జీవితం గడుపుతున్న ‘నేను’ క్రమక్రమంగా ఒక మానవుని రూపంలోకి మారిపోయాను. బ్రహ్మచారి జీవితం గడుపుతూ ఉండిన నేను ఒక భర్తగా మారాను. ఒంటరిగా ఒకే శరీరాన్ని కలిగిన నేను ఒక తండ్రిగా మారాను. ఇతరులకు శ్రేయస్కర మార్గాన్ని చూపుతూ ఉండిన నేను  స్వయంగా శ్రేయస్కర మార్గాన్ని అన్వేషించే వాడిగా మారాను. బౌద్ధ సన్యాసులను, జంతువులను దైవాలుగా విశ్వసించే నేను ఒక్కడైన అల్లాహ్‌ాను నిజమైన ఆరాధ్యునిగా, దేవునిగా అంగీకరించి విశ్వసించాను.

 క్లుప్తంగా చెప్పాలంటే నేను పూర్వం దేవుడిగా ఉండేవాడిని. (ఆ విధంగా నేనూ భావించేవాడిని, ప్రజలూ విశ్వసించేవారు).  నేను మానవుడిగా మారిపోయాను. ప్రారంభం నుంచి చివరివరకు నా జీవితానికి సంబంధించిన పరిస్థితులను క్లుప్తంగా మీ ముందు పొందుపరుస్తాను.

      బుద్ధం శరణం గచ్ఛామి

      ధర్మం శరణం గచ్ఛామి

      సంఘం శరణం గచ్ఛామి

ఈ సూత్రాలకు అనుగుణంగా జీవితం గడుపుతూ ఉండిన నా నోటి నుంచి ఈ పలుకులు, నినాదాలు వెలువడుతూ ఉండేవి. నేను బోధి వృక్షం క్రింద కూర్చుని జ్ఞానాన్ని ఆర్జించాను, బౌద్ధ సన్యాసి నయ్యాను, ప్రపంచంలో బౌద్ధ మత ప్రచారకునిగా కొనసాగాను.

గౌతమ బుద్ధుడు:

  మానవుడిని మానవుడి దాస్యం నుంచి వెలికి తీసిన, అజ్ఞానాన్ని అంతమొందించిన, ఆర్య జాతి హింసాదౌర్జన్యాలను తుద ముట్టించిన, మానవునికి శాంతి శ్రేయాల మార్గాన్ని చూపిన వ్యక్తి గౌతమ బుద్ధుడు.

బ్రహ్మచారులు:

  బౌద్ధ విశ్వాసాన్ని భువిలో ప్రచారం చేసే మేము, లౌకిక వాంఛలను కలిగి ఉండని బ్రహ్మచారులమైన మేము, రాజ   దర్బారుల  లో వలె బౌద్ధ విహారాలలో సుఖవంతమైన జీవితం గడిపే మేము ఆర్య వర్ణ వ్యవస్థ (కుల వ్యవస్థ)కు వ్యతిరేకంగా కరవాలమెత్తి బయలుదేరినవారము.

మానవుడెవరు?

మానవుడు స్వయంగా జన్మించాడా? లేక ఏ దేవుడయినా అతడిని పుట్టించాడా? మరణం ఎందుకు సంభవిస్తుంది? మరణించిన తర్వాత మానవుడేమవుతాడు?

  నా అంతరాత్మ నన్ను ఇటువంటి పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండేది. నా మనో మస్తిష్కాలలో ఇటువంటి ప్రశ్నల తుఫాను చెలరేగేది. పోగొట్టుకునే వస్తువును వెతుక్కునే వ్యక్తి వలె వాటికి సమాధానాలను అన్వేషించసాగాను. తత్కారణంగా నాలో క్రమక్రమంగా మనో వాంఛల పట్ల ఏహ్య భావం జనించసాగింది. నేెను సత్యా న్వేషణలో నిమగ్నుడయ్యాను. తత్కారణంగా నా హృదయంలో ఒక కాంతి కిరణం ప్రసరించింది. డబ్బు వెచ్చించడం వల్ల లభ్యం కాజాలని ప్రేమ, కారుణ్యం, అణుకువలు నా హృదయంలో జనించాయి. నేను పయనిస్తున్న మార్గం సరైనదో   కాదో తెలుసుకోవాలనే తపన నాలో జనించింది. అదే విధంగా ఇతర మతాలను పరికించే కోరిక కూడా నాలో జనించింది. నడి వయస్సులో నాలో జనించిన చింతన నా పూర్వపు జీవితాన్ని స్వయంగా సమీక్షించు కునేందుకై అత్యుత్తమ అవకాశాన్ని ప్రసాదించింది. యాదవ కులంలో పుట్టిన నేను ‘స్వామీ ఆనంద్‌ జీ” గా ప్రసిద్ధు డయ్యాను. పట్టు పీఠం మీద కూర్చుండబెట్టి దర్బారు సేవకులు నన్ను ఒక చోటి నుంచి మరొక చోటికి తీసుకెళ్తూ ఉండేవారు. ఇదీ నా పూర్వ స్థితి.

నా పూర్వీకులు తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం  జిల్లాలో పరమక్కుడికు సమీపంలో ఆలకన్‌ కులమ్‌  గ్రామంలో స్థిర పడ్డారు. ఆ తర్వాత సిద్దార్‌ కొట్టాయ్‌  ఓడ రేవు నుంచి వారు ఓడలో  బర్మాకు  పయన

మయ్యారు. బర్మాలో నా తాతగారు తన కుటుంబంతో సహా సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉండేవారు.

  నేను   యాదవ కులంలో పుట్టాను. నా పూర్వీకులు పశువుల కాపరులుగా జీవనం కొనసాగించేవారు. కానీ  నేను ఈ రోజు బౌద్ధ గురువయిన స్వామి ఆనందుడిగా పిలువబడుతున్నాను. ఆర్థికాభివృద్ధికై నా వంశస్థులు బర్మాకు వలస పోయారు. అయితే వారు తమిళ భాషను మాతృ భాషగా గుర్తుంచుకున్నారు.

  నా తండ్రి బాల్యం నుంచే నిబద్ధుడైన బౌద్ధుడిగా ఉండేవారు. అందుకే నన్ను కూడా ఆయన బౌద్ధ మతానుసారం పోషించారు. పలు బౌద్ధ మందిరాలలో నా విద్యాభ్యాసం కొనసాగింది. నన్ను ఒక బౌద్ధ భిక్షువుగా రూపొందించాలని నా తండ్రి ఎంతగానో కోరుకునేవారు. అందుకే ఆయన నాకు తత్సంబంధిత విద్యలన్నింటినీ నేర్పారు. రంగూన్‌, టిబెట్‌, చైనా , గోర్బా, కంబోడియా, జపాన్‌ తదితర దేశాలలోని గురువుల వద్ద నేను విద్యనభ్యసించాను. 19 సంవత్సరాల వయసుకు చేరుకునేలోగా నేను సంపూర్ణంగా విద్యలనభ్యసించాను. బర్మాకు చెందిన రెండవ రాజధాని అయిన మండలాలో బౌద్ధ మత గురువైన చానీషరా ఆసియా ఖండంలోని ఐదుగురు మహా బౌద్ధ గురువులలో ఒకడిగా నన్ను గుర్తిస్తూ ఆమోదించారు. అలాగే నాకు పసుపు పచ్చని వస్త్రాలు కూడా తొడగబడ్డాయి. ఆ విధంగా బౌద్ధ భిక్షువులలో నాకు మహోన్నత స్థాయి ప్రాప్తమయింది. నన్ను జపాన్‌లోని టోక్యో నగరానికి చెందిన ‘బోది దాసోవాసో’ అనే పేరు గల బౌద్ధ మత గురువు నాగసాకి నగరంలో నన్ను   నియమించారు.  అలాగే ప్రపంచమంతటా బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి వ్యాపింపజేయడానికి సంబంధించిన మహా బాధ్యత నాపై మోపబడింది. అలాగే 101 గురువులకు అధ్యక్షత వహించే అవకాశం నాకు లభించింది. ఆ తర్వాత నేను ప్రపంచమంతటా పర్యటిస్తూ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయనారంభించాను. బౌద్ధులు ఉండే నైరుతి ఆసియాలోని 17 దేశాలలోనే కాకుండా యూరప్‌లోనూ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయసాగాను.

 బౌద్ధ మత ప్రపంచంలో నాకు సర్వోన్నత స్థాయి ప్రాప్తమయింది. ప్రపంచమంతటా పర్యటించేందుకై నాకు ప్రభుత్వం తరఫున గ్రీన్‌ కార్డులు లభ్యమయ్యాయి. వాటి ద్వారా నేను  అరబ్‌ దేశాలు తప్ప  ప్రపంచ మంతటా పర్యటిస్తూ   బౌద్ధ మతాన్ని ప్రచారం చేయసాగాను.

  నా సొంత సోదరుడైన స్వామి నందాచార్య నేటికీ అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌  నగరంలో 67 అంతస్థుల బౌద్ధ ఆశ్రమంలో మఠాధిపతిగా కొనసాగుతూ ఉన్నాడు. నేను కూడా అక్కడ మూడున్నర సంవత్సరాల పాటు మఠాధిపతిగా కొనసాగాను.

చేెతబడులు, మహిమలు:

  చైనా, టిబెట్‌, జపాన్‌ మొదలయిన దేశాల్లో చేతబడి ద్వారా,  క్షుద్రవిద్యల ద్వారా నాకు ఎన్నో మహిమలు చేకూరాయి. ఆ కాలంలో నేను చేతబడి ద్వారా ఆత్మలను ఆహ్వానిస్తూ వాటిచే భవిష్యవాణి పలికించే కార్యకలాపాల్లో నిమగ్నుడయి ఉండేవాడిని. ‘కాళి’, ‘కాడి’, ‘కలకత్తా కాళి’, ‘కేరళ దేవి’లను పూజించి రాగి రేకుల మీద లేదా రాగి దారాల మీద ఊది  ప్రజలకు   ఇస్తూ ఉండేవాడిని. అలాగే దేవతలను 101 వెండి పాత్రల్లో బంధించేవాడిని. నాకు ఏమీ తోచకపోతే ఆ పాత్రల్లోని దేవతలను బైటికి తీసి అంధకారంలో వాటితో మాట్లాడుతూ ఉండేవాడిని.

  ఆ తర్వాత నేను నన్ను కలుసుకునేందుకు వచ్చినవారిలోనూ, ప్రపంచంలోని బౌద్ధు లందరిలోనూ దేవతల భాష పట్ల, వారి భవిష్యవాణుల పట్ల అవగాహన గలవాడిగా, వాటితో మాట్లాడే ‘మహా గురువుగా ఆనంద్‌ జీ’గా సుప్రసిద్ధుడినయ్యాను.

ఆశీర్వాదం:

పలువురు నాయకులు, ప్రభుత్వాధినేతలు తమ తలల మీద నా పాదాన్ని ఉంచి ఆశీర్వాదం పొందడాన్ని మహాభాగ్యంగా భావించేవారు. సింగపూర్‌కు చెందిన మొదటి రాజు తల మీద నా పాదాన్ని ఉంచి మూడు పర్యాయాలు నేను అతడ్ని ఆశీర్వదించాను. అదే విధంగా థాయ్‌లాండ్‌ రాజైన బర్మాపూజో చీనిస్వీన్‌ తల మీద కూడా నా పాదముంచి ఆశీర్వదించాను. అదే విధంగా మన మాజీ ప్రధాన మంత్రి అయిన రాజీవ్‌ గాంధీ, జపాన్‌ ఉపాథ్యక్షుల తలల మీద పాదముంచి ఆశీర్వదించాను. శుక్రవారం నాడు, మంగళవారం నాడు నన్ను బంగారు సింహాసనం మీద నిల్చుండ బెట్టి ఒక నీటి కుండలోని నీటి ద్వారా నా పాదాలను కడగాలంటే ఒక లక్షా  ఒక రూపాయిగా నిర్ణయించబడింది. ఆ నీటిని ఐదుగురు వ్యక్తులు తాగుతారు. మరి నేను దేవుని అవతారాన్ని కానా? (అని ఆనాడు భావిస్తూ ఉండేవాడిని).

  బుద్ధుని మరొక జన్మలో రూపంగా, దేవతల అధ్యక్షునిగా, దేవుళ్ళతో మాట్లాడే సామర్ధ్యాన్ని కలిగి ఉన్న దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పర్యటించేవానిగా నేను సుప్రసిద్ధుడినయ్యాను.

  చికిత్స లేని వ్యాధులకు గురయిన ఎందరో వ్యాధిగ్రస్తులు నా మూత్రాన్ని త్రాగేవారు. తద్వారా వారికి ఆరోగ్యం చేకూరేది (అని వారు భావించేవారు). ‘నా మూత్రాన్ని వారు త్రాగడంలో తప్పెేముంది? ఎందుకంటే నేను దేవుడిని గదా!’ (అని ఆనాడు భావిస్తూ ఉండేవాడిని.

మానవుడు దేవుడా? 
నేను బోధి వృక్షం క్రింద వెండి సింహాసనం మీద కూర్చుండేవాడిని. బంగారాన్ని, సంపదను ఆ సింహాసనం ముందు ఉంచి వారు నా కాళ్ళ మీద పడి వేడుకునే నా భక్తులను నేను ఆశీర్వదిస్తూ  ఉండేవాడిని. వారు నా  ఆశీర్వాదాన్ని పొందేందుకై నన్ను అన్వేషిస్తూ బయలుదేరేవారు. ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ఈ విధంగా అర్థించాడు: ”గురూజీ! నేను దేవుడిని చూడలేదు. మీరే ఆ సర్వోత్కృష్ట సజీవ దైవం. నాకు ప్రపంచంలోని సర్వ  సుఖాలూ ప్రాప్తమాయ్యయి. కాని నాకు వివాహమై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం కలుగలేదు. గురూజీ! మీరు నాకు సంతానం కలిగేలా అత్యుత్తమ రీతిలో నన్ను ఆశీర్వదించండి”. ఆ విధంగా పలికిన ఆ వ్యక్తి నా పాదాల మీద తన చేతిని ఉంచి ఆ చేతిని తన కళ్ళకు అద్దుకోసాగాడు. సరిగ్గా అక్కడి నుంచే సమస్య మొదలయింది. నన్ను వెదుక్కుంటూ నా ఆశ్రమానికి వచ్చిన ఆ భక్తుడు కోటీశ్వరుడు. దానితో అతన్ని మోసపుచ్చాలనే ఆలోచన నాలో పురివిప్పింది.  నేను అతనితో ఈ విధంగా పలికాను: ”ఈ రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత నీకు తాయెత్తు ఇస్తాను. పడుకునే  ముందు   దానిని
 నీవు నీ దిండు క్రింద పెట్టుకో. ఈ రోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతాడు. రేపు వచ్చి దేవుడు నీతో మాట్లాడాడో లేదో నాకు తెలుపు” యాదృచ్ఛికంగా ఆ వ్యక్తి మరుసటి రోజు నా ఇంటి తలుపు తట్టాడు. ఆ సమయంలో నా శిష్యుడు ఆదరాబాదరాగా నా దగ్గరికి వచ్చి ‘గురూజీ! ఆ కోటీశ్వరుడొచ్చాడు’ అని సమాచారమందించాడు. ”ఏ కోటీశ్వరుడు?” అని నేను శిష్యుడును ప్రశ్నించాను. ”సంతానం కోసం అర్థిస్తూ మీ దగ్గరకొచ్చి తాయెత్తు తీసుకెళ్ళిన కోటీశ్వరుడే” అని శిష్యుడు సమాధానమిచ్చాడు. నేను వెంటనే పసుపు పచ్చని వస్త్రాలు ధరించి పట్టు విసన కర్ర చేతబూని భిక్షాపాత్రను పట్టుకొని అప్పుడే బుద్ధుడు అవతరించినట్లుగా అభినయిస్తూ ఆ వ్యక్తి వద్ద్దకు చేరుకున్నాను. ఆ కోటీశ్వరుడు వెంటనే నా కాళ్ళ మీద పడిపోయాడు. ”దేవుడు నాతో మాట్లాడాడు” అని పలికి ఏడ్వనారం భించాడు!    నేను స్వయంగా దేవుడిని చూడలేదు. కానీ నా బూటకపు తాయెత్తు ధరించిన ఈ మూర్ఖుడు దేవుడు తనతో మాట్లాడాడని పలుకుతున్నాడు. అతడి మాటలు వినగానే నేను విభ్రాంతి చెందాను. నేను ఏం వింటున్నాను?! 45 సంవత్సరాలుగా తల గొరిగించుకొని, తాయెత్తులు, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, బ్రహ్మచారి జీవితాన్ని గడిపి, అన్ని కోరికలను త్యజించి, సన్యాసిగా రూపొంది, బోధి వృక్షం క్రింద నిత్యం ‘బుద్ధా….బుద్ధా’ అని బిగ్గరగా జపిస్తూ ఉండే నన్ను, ప్రజలకు తాయెత్తులిచ్చే నన్ను విస్మరించి దేవుడు అతడితో మాట్లాడాడా?! ఇది న్యాయమేనా?! ఒకవేళ దేవుడు నిజంగానే మాట్లాడదలుచుకుంటే నాతో మాట్లాడి ఉండవలసింది. 45 సంవత్సరాలుగా నా బుద్ధుడు నాతో మాట్లాడలేదు. కానీ నేనిచ్చిన తాయెత్తు ధరించిన నా శిష్యునితో దేవుడు ఎలా మాట్లాడాడు? మోసపుచ్చేవాడున్నంత వరకు మోసపోయేవాడు కూడా ఉంటాడు!!
  స్వాముల పరిస్థితి ఏమిటంటే పసుపు పచ్చని వస్త్రాలలో పవిత్రతా ముసుగు ధరించి మహాత్ములుగా చలామణీ అవుతారు. ఒకవేళ పోలీసులు వారిని పట్టుకుంటే మహా పాపాత్ములుగా బహిర్గతమవుతారు. అటువంటి స్వాములలో బ్రహ్మానంద స్వామి,  చంద్ర స్వామి  
మార్తాండతం, జాన్‌ జోసెఫ్‌ మొదలైనవారు ప్రసిద్ధులు.
ముస్లింలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతూ ఉంటారనే విషయాన్ని నా పూర్వీకులు నా మనో మస్తిష్కాలలో బలంగా నాటారు. నా పూర్వీకులు యాదవ కులస్థులు. వారు పశువులను పోషించే వృత్తిలో కొనసాగేవారు. అలాగే వారు ఆవును దేవతగా కొలిచేవారు కూడా. నేను బాల్యంలో బౌద్ధ గురువుగా కొనసాగేవాడిని. అయినప్పటికీ నా తల్లి ఆవును పూజించి దానిని దేవతగా విశ్వసించేది. అలాగే నన్ను కూడా ఆ విధంగా చేసేలా ప్రేరేపించేది. అయితే ముస్లిం అటువంటి దేవుడిని (ఆవును) కోసి బిరియానీ చేసుకుంటాడు. నేను ఒక బౌద్ధ గురువయిన కారణంగా ఇస్లాంను అధ్యయనం చేయడం నా కొరకు సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అదే సమయంలో కొంత మంది ముస్లింలతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి.  
 ఇస్లాం నన్ను ఆవరించింది:
  కొన్ని రోజలు గడిచిన తర్వాత ముస్లిలతో నా సంబంధాలు బలపడసాగాయి. అలాగే  ఇస్లాంను అవగాహన చేసుకోవడానికి దోహదపడే సౌలభ్యాలు నాకు ప్రాప్తమవ సాగాయి. ఇస్లాంకు సంబంధించి వ్రాయబడిన చిన్న చిన్న పుస్తకాలు అధ్యయనం చేయడాన్ని ప్రారంభించాను. దైవ ప్రవక్త హజ్రత్‌ ముహమ్మద్‌ (స) జీవిత చరిత్రను అధ్యయనం చేయడం వల్ల ఖుర్‌ఆన్‌ను అధ్యయనం చేయాలనే ఆసక్తి నాలో కలిగింది. దానితో నేను ఖుర్‌ఆన్‌ అధ్యయనాన్ని కొనసాగించాను, ”ఈ ప్రపంచాన్ని, సమస్త జీవరాసులను ఒకే సృష్టికర్త సృష్టించాడు” దీనిని బట్టి నాకు తెలిసిన విషయమేమిటంటే సూర్యుడు ఉదయం పూట ఉదయించడం, సాయంత్రం వేళ అస్తమించడం మొదలయిన చర్యలన్నీ సృష్టికర్త ఆజ్ఞ ద్వారానే జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయనచే సృష్టించబడిన అత్యుత్తమ జీవరాసులను పరిశీలించి నేను ఆశ్చర్యంలో మునిగి పోయాను. చివరకు ఇస్లామీయ చింతన నా హృదయంలో నిబిడీకృతం కాసాగింది. అలాగే ఈ భావనలు నా మస్తిష్కంలో తుఫాను రేపసాగాయి. అలాగే   ఇస్లాంను   అవగాహన తుఫాను రేపసాగాయి. అలాగే ఇస్లాంను అవగాహన      చేసుకోవలసిందిగా,    దానిని స్వీకరించవలసిందిగా నన్ను కుదిపి వేయసాగాయి. దానితో మరొక పర్యాయం ఖుర్‌ఆన్‌ను అధ్యయనం చేసి చూడాలనే ఆలోచన నా మదిలో చెలరేగింది. ఆ ఆసక్తి నాలో తిరిగి మొలకెత్తింది. నేను ఏకాగ్రచిత్తుడినై ఖుర్‌ఆన్‌ అధ్యయనంలో మునిగిపోయాను. దానితో పాటు ఆశ్రమానికి సంబంధించిన నా దైనందిన కార్యకలాపాల విషయంలో అనాసక్తత పెరుగుతూ పోయింది. ఉదయం పూట, సాయంత్రం వేళ అగరుబత్తిని, కొవ్వొత్తిని వెలిగించి, నీటిలో పూలు వేసి ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అని జపించే కార్యం నిలిచిపోయింది. 
మార్పుకు నాంది: 
ఖుర్‌ఆన్‌ను రెండు పర్యాయాలు అధ్యయనం చేసిన తర్వాత నా మనో కవాటాలు తెరుచుకున్నాయి. దానితో నేను గత 35 సంవత్సరాలుగా మార్గభ్రష్ఠత్వంలో    ఉన్నాననే విషయం నాకు అర్థం అయింది. అన్ని వస్తువులు సృష్టికర్త ఆధీనంలోనే ఉన్నాయి.  ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా సుఖబోగాలకు అలవాటు పడిన స్వామి (అంటే నేను) సుఖవంతమైన జీవితాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు. అలాగే నా శరీరం అందుకు సుముఖత చూపలేక పోయింది. ఆ కాలంలో ఒక దళిత నాయకుడు నా నుంచి ఆశీర్వాదం పొందే ఉద్దేశ్యంతో నా దగ్గరికి వచ్చాడు. నేను అతడి తల మీద నా పాదముంచి ‘మీరు 120 సంవత్సరాలు బ్రతుకుతారు’ అని ఆశీర్వదించాను. అయితే నా ఆశీర్వాదాన్ని పొందిన 90 రోజులకే ఆ వ్యక్తి మరణించాడు. ఆ ఉదంతం నా అంతరాత్మను నిలదీసింది. కుదిపివేసింది. నా సరికొత్త జీవితానికి, మార్పుకు నాంది ఆ సంఘటనే. అదేవిధంగా మరొక సంఘటన కూడా జరిగింది. 
1991లో భారత దేశ పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో మాజీ ప్రధాన మంత్రి అయిన రాజీవ్‌ గాంధీ కంచి శంకరాచార్య వారి ఆశీర్వాదం పొందేందుకై వచ్చారు. రాజీవ్‌ గాంధీ తలమీద తన పాదం ఉంచి శంకరాచార్య ఈ విధంగా పలికారు: ”101 సంవత్సరాల పాటు మీరు జీవిస్తారు. భారతదేశానికి మీరే ఎల్లప్పుడూ ప్రధాన మంత్రిగా కొనసాగుతారు”. ఆ విధంగా కంచి పీఠాధిపతి అయిన శంకరాచార్య ఆశీర్వదించిన తర్వాత 27వ రోజున రాజీవ్‌ గాంధీ సిరి పెరంబుదూర్‌లో మానవ బాంబు ద్వారా హతులయ్యారు. 
  ఈ రెండు సంఘటనలు నా అంతరాత్మను నిత్యం నిలదీస్తూ ఉండేవి. ఒక బౌద్ధ స్వామి అయిన నేను ఎవరినయితే     ఆశీర్వదించానో అతను 90 రోజుల్లోనే చనిపోయాడు. అలాగే హిందువుల గురువైన శంకరాచార్య   ఎవరినైతే ఆశీర్వదించారో అతడు 27వ రోజే చనిపోయాడు. దానితో ఆవిధంగా ఆశీర్వదించిన శంకరాచార్య, బౌద్ధ భిక్షువు అయిన ఇద్దరూ బూటకపు దేవుళ్ళనే విషయం నాకు స్పష్టంగా తెలిసింది. ఇంతకు మించిన అప్రతిష్ట మరేముంటుంది? దీనిని బట్టి మానవుడు ఏ శక్తికీ అధిపతి కాడనే విషయం తేట తెల్లమైంది. భువిలో కేవలం అల్ల్లాహ్‌ా ఆజ్ఞ మాత్రమే నడుస్తుంది. ఆ వాస్తవం నా మదిలో దేవుని పట్ల విశ్వాసాన్ని జనింపజేసింది.  అలాగే నా వంటి నీచునికి, అల్పునికి ఆశీర్వదించే అర్హత ఏ మాత్రం లేదని తెలియజేస్తూ నా కనులు తెరిపించింది. ఆ విధంగా నేను సత్యం వైపునకు మేల్కొన్న తర్వాత సుదీర్ఘ కాలంగా నేను ధరిస్తూ వస్తున్న పసుపు పచ్చని వస్త్రాలను పరిత్యజించాను. అలాగే ఆల్లాహ్‌ా తప్ప నిజమైన ఆరాధ్యుడు లేడనే విషయం పట్ల ప్రగాఢ విశ్వాసం నాలో జనించింది.
మానవుడు దేవుడా?
‘నేను దేవుడినా?’ ఇస్లాం నన్ను ఈ విషయం గురించి ఆలోచించేలా చేసింది. మానవుడు మానవుడిగా జీవించాలి. అదే అతడి ఆరోహణం. మానవుడు అన్ని విషయాల నుంచి విముక్తి పొందగలడు గానీ వైవాహిక జీవితం నుండి విముక్తి పొందినట్లయితే అతడు కుళ్ళిపోతాడు. ఒక మానవునికి నలుగురు భార్యలతో కలిసి జీవించే హక్కుంది. వైవాహిక జీవితాన్ని త్యజించి సన్యాసులుగా మారి వందలాది ఆడపిల్లలతో వ్యభిచరించి వారి జీవితాలను నాశనం చేయడానికి (తిరుచ్చిలో ‘ప్రేమానంద’ అనే పేరుతో పిలువబడే హిందూ సన్యాసి 100 మందికి మించిన ఆడపిల్లలపై అత్యాచారం చేశాడనే అభియోగం మీద జైలుకు పంపబడ్డాడు. ఈ  వాక్యం     వాస్తవానికి   ఆ సంఘటనను సూచిస్తుంది.) సంబంధించిన ఇటువంటి మహా పాపం (వ్యభిచారం) నుంచి, దౌర్జన్యం నుంచి ఇస్లాం నన్ను రక్షించింది. నేను నా తల మీద నుంచి పసుపు పచ్చని వస్త్రాలను తొలగించి మానవుడినయ్యాను.
గురువు, ఆయన శాపం:
నేను ఇస్లాం స్వీకరించిన విషయం దావానలంలా బౌద్ధమత ప్రపంచమంతటా వ్యాపించింది. అప్పటి బౌద్ధ మహా గురువయిన, టిబెట్‌ స్వామికి కూడా ఈ విషయం తెలిసింది. ఆయన నిత్యం నన్ను ప్రశంసిస్తూ ఉండేవారు. నేను ఇస్లాం స్వీకరించిన విషయం తెలియగానే ఆయన నన్ను పిలిపించారు. ఆయన ఒక స్వామి మాత్రమే కాకుండా నిపుణుడయిన మాంత్రికుడు కూడా. నేను కూడా సంతోషంగా ఆయన్ను కలుసుకునేందుకు వెళ్ళాను. నేను నా స్థితిగతుల గురించి ఆయనకు తెలియజేశాను. ఆయన ఈ విధంగా పలికారు: ”మీరు ఇస్లాం స్వీకరించడం వల్ల బౌద్ధమతానికి కేవలం నష్టం కలగటం మాత్రమే కాకుండా బౌద్ధ మతంలో చేరే సామాన్య జనుల శాతం బాగా క్ష్షీణిస్తుంది. కనుక మీరు ఈ విషయం గురించి ఆలోచించండి”. నేను ఈ విధంగా సమాధాన మిచ్చాను: ”నా నిర్ణయం విషయంలో పునరాలోచనకు ఏ మాత్రం అవకాశం లేదు” నేను ఆ విధంగా సమాధానమివ్వగలనని స్వయంగా నేనే ఊహించలేదు. ఒకప్పుడు నా గురువు కుందేలుకు మూడు కాళ్ళే ఉంటాయంటే నేను కళ్ళు మూసుకుని ‘అవును, నిజమే. కుందేలుకు మూడు కాళ్ళే ఉంటాయి’ అంటూ ధృవీకరించేవాడిని. నా సమాధానం విని ఆయన ఎంతగానో నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహోదగ్రులయ్యారు. అలాగే ఆయన నన్ను శపించారు. అంతకు ముందు నేను ఆయన శాపాన్ని విన్నంతనే కంపించిపోయేవాడిని. కానీ ఈ పర్యాయం ఆయన నన్ను శపించినప్పటికీ నేను ఏ మాత్రం ఆందోళనకు లోనుకాలేదు. ఆయన నన్ను ఈ విధంగా శపించారు: ”నా మాటలను ధిక్కరించి ఇస్లాంను విడనాడనట్లయితే 150 రోజుల లోపల నీ చేయి ఒకటి, కాలు ఒకటి పక్షవాతానికి గురవుతాయి”. 
  ఇటువంటి వ్యర్థ విషయాలకు, అసంబద్ధ విషయాలకు ఇస్లాంలో ఎంత మాత్రం అవకాశం లేదనే విషయం నాకు తెలిసింది. అయినప్పటికీ ఆ శాపం యొక్క దుష్ప్రభావం ఏమయినా పడుతుందేమోననే దుష్ట ప్రేరణలను షైతాన్‌ నా మదిలో కలిగించసాగాడు. కానీ నేను ఆ దుష్ట ప్రేరణలను పట్టించుకోకుండా అల్లాహ్ పై నమ్మకం ఉంచి  అక్కడ నుంచి వెనుదిరిగాను. ఆ తర్వాత నేను ప్రతి రోజూ ఎంతో జాగ్రత్తగా గడపసాగాను. ఎందుకంటే రేపు నేను ఏదయినా ఆపదలో చిక్కుకున్నట్లయితే అది ఆ శాప ప్రభావమేనని ప్రజలు వదంతులను వ్యాపింపజేస్తారేమోనని నేను భయపడ్డాను. ఆ ఆలోచనతోనే నేను ఆందోళనతో గడపసాగాను. అయితే అల్లాహ్  అనుగ్రహం వలన 150 రోజులు శ్రేయస్కరంగా, ఎటువంటి ఆపదలోనూ నేను చిక్కుకోకుండా  గడచిపోయాయి. 150 రోజులు గడవటానికి ముందు పవిత్ర మక్కా నగరానికి వెళ్ళే అవకాశం నాకు లభించింది. అల్‌హమ్దులిల్లాహ్  (అల్లాహ్ కు స్తోత్రములు).
   ఆయన నన్ను శపించిన తర్వాత నేను నా జీవితంలో ఎన్నో మహిమలకు ఆనందానుభూతులను పొందాను. అటువంటి శాపాన్ని పొందిన తర్వాత ప్రజలు తరచుగా చింతాగ్రస్తులై తమ జీవితాను పాడు చేసుకుంటారు. అయితే అల్లాహ్‌ా తన అనుగ్రహంతో అటువంటి అపాయకరమైన పరిస్థితిలోనూ నన్ను సురక్షితంగా ఉంచాడు. ఇస్లాంను స్వీకరించిన తర్వాత మానవుని జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో ఇతరులను మోసం చేయకుండా ఉండటమనేది కూడా ఒకటి.
  గడచిన 45 సంవత్సరాల కాలంలో ఒక బౌద్ధ బిక్షువు రూపంలో ‘నేను’ వందలాది మందిని మోసం చేశాను. కానీ నేడు ఆ దుష్కార్యాన్ని పూర్తిగా మరచిపోయాను. అలాగే నా కంటే ఉన్నత స్థాయిలో ఉండే గురువుల ద్వారా నేను కూడా మోసపోవలసి వచ్చింది. నా సరికొత్త జీవితంలో ఈ రెండు చెడుగులూ అంతరించిపోయాయి. పసుపుపచ్చటి వస్త్రాలు ధరించిన కాలంలో నా నైజంలో కాఠిన్యం ఉండేది. అయితే దేవుని ఏకత్వపు విశ్వాసాన్ని స్వీకరించిన తర్వాత ఒక మృదువైన హృదయం గల మానవునిగా మారిపోయాను. ఇస్లాం కారణంగా నా జీవితంలో సరికొత్త మార్పులు సంభవించాయి. దేవుని ఏకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ నేను ఇస్లాం స్వీకరించడం 
  3,అక్టొబర్‌, 1993లో చెన్నయిలోని ‘మస్జిదె మామూర్‌’లో దేవుని ఏకత్వం (తౌహీద్‌) పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఇస్లాం కలిమా పఠిస్తూ ఇస్లాంను స్వీకరించి ఇస్లామీయ సమాజంలోకి చేరిపోయాను. ఆ విధంగా ‘స్వామి ఆనంద’గా కొనసాగిన నేను ‘ముహిబ్బుల్లాహ్ ‘  (అల్లాహ్ ను ప్రేమించేవాడు)గా మారిపోయాను. నవజాత శిశువు (”ఇస్లాం స్వీకరణ పూర్వపు పాపాలన్నింటినీ కడిగివేస్తుంది” అనే హదీసును ఇది సూచిస్తుంది.)గా మారిపోయాను. అల్లాహ్‌ా దృష్టిలో మానవులందరూ సమానులే.  ఈ మౌలిక సూత్రం రుచిని నాలో నేనే ఆస్వాదించాను. నేటి నుంచి నాకు కూడా ప్రపంచంలోని మస్జిదు లన్నింటిలోనూ హక్కు ఉంది. నేను కూడా ముస్లింలందరితో కలిసి నమాజు చదివే విషయంలో సమానమైన హక్కును కలిగి ఉన్నాను. ఇన్షాఅల్లాహ్‌ా నేటి నుంచి ఒకవేళ నేను ప్రపంచంలోని ఏదైనా మస్జిద్‌లో నమాజు  చదివే ఉద్దేశ్యంతో వెళ్ళాలని నిర్ణయించు కున్నట్లయితే ప్రపంలోని ఏ శక్తీ నన్ను నిలువరించ జాలదు. నేను ఇస్లాంను స్వీకరించినప్పుడు ప్రజలతో ప్రేమానురాగాలతో వ్యవహరించాలని, ఈ సోదరభావం గురించి, ప్రేమానురాగాల గురించి ప్రకటించాలనే కోరిక నాలో జనించింది. ఈ భావనతో నేను ఇస్లాంను గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకై ముస్లింలు నివసించే కాయీల్‌ పట్నం జిల్లాలోని చదమ్‌ బర్నాద్‌ వైపునకు పయనించాను. అక్కడ నేను ఇస్లాంను మరింతగా అర్థం చేసుకునేందుకై ప్రయత్నించాను. ఆ తర్వాత నేను నా జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా విశ్వాసాన్ని పటిష్టపరచుకోవడం, ఇస్లాంను ప్రచారం చేయడం, ప్రజలకు సమానత్వానికి సంబంధించిన నిజమైన భావనను పరిచయం చేయడమే నా జీవిత లక్ష్యమ్.
  ఇస్లాం స్వీకరించడానికి ముందు ఇస్లాం విషయంలో నేను ఎన్నో అపోహలకు గురయ్యాను. అటువంటి అపోహలకు గురయినవారు నేడు కోట్లమంది ఉన్నారు. వాస్తవానికి వారందరూ ఇస్లాం యొక్క సర్వోత్కృష్ట వరానుగ్రహానికి దూరమయి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారికి ఇస్లాం సుగుణాలకు, ఇస్లామీయ సోదరభావానికి సంబంధించిన సందేశాన్ని అందజేసి   ఇస్లాంకు   చెందిన   మంచి  మార్గంలో పయనింపజేయటం, ఇస్లాం వాస్తవికత పట్ల వారికి అవగాహన కలుగజేయడం, వారి అపోహలను దూరం చేయడం, వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించడం మొదలయినవి ముస్లింల బాధ్యత.
  ”కున్‌తుమ్‌ ఖైర ఉమ్మతిన్‌ ఉఖ్‌రిజత్‌ లిన్నాసి తఅమురూన బిల్‌ మాఅరూఫి వ తన్‌హౌన అనిల్‌ మున్‌కరి వ తుఅమినూన బిల్లాహ్ ” (ఆలి ఇమ్రాన్‌: 110) (ప్రపంచంలో మానవులకు మార్గం చూపేందుకు, సంస్కరించేందుకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి వారిస్తారు. అల్లాహ్ను విశ్వసిస్తారు.)
హజ్రత్‌ ముహమ్మద్‌ (స) జీవిత చరిత్ర
  మానవ చరిత్రలో విస్మరించరాని అసాధారణ వ్యక్తి ఎవరయినా ఉన్నట్లయితే అది కేవలం హజ్రత్‌ ముహమ్మద్‌ (స) మాత్రమే.  ఆయన జీవిత చరిత్రను చదివేందుకై నేను ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేశాను. అప్పుడు నా జీవితంలో విప్లవం చోటు చేసుకుంది. క్రీ.శ. 571లో జన్మించిన హజ్రత్‌ ముహమ్మద్‌ (స) పవిత్ర జీవిత చరిత్రను ఒకవేళ ఎవరైనా లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఆయన (స) విశిష్ఠతలన్నీ అవగతమయిపోతాయి. ఆయన వలే జీవితం గడిపిన వ్యక్తి ఎవరూ ఈ భూప్రపంచంలో పుట్టనేలేదు. అంతే కాకుండా ఇంకా ఎన్నో విశిష్ఠతలను ఆయనలో మనం కనుగొనగలము. ఆయన విశ్వాస బలం, సంకల్పశుద్ధి, పరస్పర సంబంధాలు, పరస్పర వ్యవహారాలు, ఇతరుల పట్ల శ్రేయోభిలాష, అత్యుత్తమ వ్యయవహార సరళి, ఇతరుల మంచితనానికి, గౌరవానికి పూర్తిగా విలువ ఇవ్వడం, అతిథి సత్కారం పట్ల ఆసక్తి, ఇతరుల పట్ల కారుణ్యం, సానుభూతి మొదలైన విశిష్ఠతలను ఆయన కలిగి ఉన్న కారణంగా నేటి ఆధునిక ప్రపంచం సైతం ఆయనను కొనియాడుతోంది. 
  మానవుని జీవితం కొరకు ఒక సులభమైన విధానం ఆయన జీవితంలో మనకు లభిస్తుంది. ఆ విధంగా నమూనా కాగల మరొక వ్యక్తి ఎవరూ లేరు. మానవ చరిత్రలో ఒక మహోత్కృష్టమైన వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని గడపడం జరిగింది? ఇతరులతో ఏ విధంగా వ్యవహరించడం జరిగింది? అనే విషయాలను ఆధారాలతో సహా నేను అధ్యయనం చేశాను.   
  హజ్రత్‌ ముహమ్మద్‌ (స)కు దైవప్రవక్త పదవి దైవం తరపు నుంచి ప్రాప్తం కావడానికి ముందు 40 సంవత్సరాలపాటు ఆయన (స) అత్యుత్తమమైన, ఆదర్శనీయమైన జీవితం గడిపారు. ఆ కాలంలోని సమాజంలో ఆయన (స) ఒక ఆదర్శనీయుడిగా శోభించారు. ప్రతి మానవునిలోనూ కొన్ని సుగుణాలు ఉంటాయి. అయితే అన్నిరకాల సుగుణాలను కలిగిన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే అది హజ్రత్‌ ముహమ్మద్‌ (స) మాత్రమే.
  ఆంగ్లేయులు ‘ఇస్లాం కరవాలం ద్వారా వ్యాపించింది’ అనే అపనిందను ఇస్లాం మీద మోపారు. వాస్తవానికి ఇది ఒక మహా అపనింద. దీనికి జవాబుగా సరోజినీ నాయుడు లండన్‌లో  ప్రసంగిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు: ”ఇస్లామీయ ఔన్నత్యం ఇతర మతానుయాయుల పట్ల విద్వేషాన్ని జనింపజేయదు. ముహమ్మద్‌ (స), ఆయన సహచరులు, వారి శిష్యులు వంటి దేశాలను సైతం పరపాలించారు. అలాగే 800 సంవత్సరాలపాటు   క్రైస్తవుల భూభాగమైన స్పెయిన్‌ను ముస్లింలు పరిపాలించారు. కానీ వారు ఏనాడూ ప్రజల ఆరాధనాలయాల విషయంలో ఎటువంటి జోక్యానికి పాల్పడలేదు. అనగా క్రైస్తవులకు వారి స్థాయిని ప్రసాదించారు. వారితో అత్యుత్తమ రీతిలో వ్యవహరించారు, గౌరవమర్యాదలతో వ్యవహరించారు, మంచి సంబంధాలను వారితో నెలకొల్పుకున్నారు. దీనికి కారణం బహుశా ఖుర్‌ఆన్‌ వారికి సహనాన్ని నేర్పడమేనేమో”.
థామస్‌ ఆర్నాల్డ్‌ ఈ విధంగా పేర్కొన్నాడు: ”ప్రపంచంలోని మతాలన్నింటిలో కేవలం ఇస్లాం మాత్రమే అన్ని రకాల విశిష్ఠతలనూ కలిగి ఉంది. సామాన్య జనుల ద్వారా ఇస్లాం వ్యాపించింది. ఆర్థిక సహాయం లభించిన కారణంగా ధర్మప్రచారం చేసేవారు, డబ్బు కోసం ధార్మిక సేవ చేసేవారు ఇస్లామీయ చరిత్రలో మనకు కన్పించరు. వందలాది  వ్యాపారుల ద్వారా ఇస్లాం వ్యాపించింది. ఆఫ్రికా, చైనాలలో ఇస్లాం వ్యాపించడానికి మూల కారణం ఖుర్‌ఆన్‌ వైజ్ఞానిక కాంతే! ఆ కాంతిని వ్యాపింపజేసేవారు అక్కడి ముస్లిం వ్యాపారస్తులే.
  పండిత్‌ సుందర్‌ లాల్‌ ఈ విధంగా పేర్కొన్నారు: ”ముహమ్మద్‌ (స ) మక్కా విజయం సందర్భంలో ఎటువంటి మహత్తరమైన పని చేశారంటే మానవ చరిత్ర ఎన్నటికీ దానిని విస్మరించజాలదు. జీవితమంతా తనను వేధించిన, కష్టాలకు గురి చేసిన, హింసాదౌర్జన్యాలకు పాల్పడిన, అవమానించిన, ప్రాణశత్రువులాగ మసలినవారందరినీ ఆయన క్షమించివేశారు. ప్రపంచంలోని సైనిక కార్యకలాపాలలో అది ఒక ఆదర్శనీయమైన ఘటన”. 
   భారత దేశానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడైన లాలా ఈశ్వరీప్రసాద్‌ ఈ విధంగా పేర్కొన్నారు: ”ముస్లింలు విశాల దృక్పథం కలవారు. ఒకవేళ వారు నిజంగానే దౌర్జన్యపరులయినట్లయితే సుదీర్ఘ కాలంపాటు భారత దేశాన్ని పరిపాలించడం వారికి సాధ్యమయ్యేది కాదు. ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ ప్రజలకు వారి విశ్వాసాల ప్రకారం ఉపదేశించేవారుగా ఉన్నారు.
  హిందువుల మతపరమైన అంశాలలో వారెన్నడూ అడ్డంకి కాలేదు. మతపరమైన ఏ విషయంలోనయినా వారు ఏ హిందువు మీదా దౌర్జన్యానికి పాల్పడలేదు. ముస్లిమేతరులతో సైతం కరుణాంతరంగులై సహకరించేవారు”. 
నా హృదయాన్ని మార్చివేసిన ఖుర్‌ఆన్‌
  నేను ఖుర్‌ఆన్‌ అధ్యయనాన్ని నిరంతరాయంగా కొనసాగించాను. తత్కారణంగా నా ఆత్మ జాగృతమయింది. ఖుర్‌ఆన్‌ ఎటువంటి దివ్యగ్రంథమంటే అందులో మానవ జీవితానికి సంబంధించిన ప్రతి వ్యవహారం కొరకు మథ్యస్థ స్థాయి మార్గదర్శకత్వం ప్రాప్తమవుతుంది. ఖుర్‌ఆన్‌కు చెందిన వైజ్ఞానిక ఆధారాలు నాలో నమ్మకాన్ని ప్రోది చేయసాగాయి. సన్యాసినయిన కారణంగా ఆ అనుభూతి నా హృదయాంతరాలలోకి చొచ్చుకుపోయింది. నేను ఇప్పుడు నా పూర్వగాథను, అనగా ఏ మతాన్నయితే నేను పూర్వం స్వీకరించానో ఆ మతం (బౌద్ధ మతం) యాథార్థ్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను.    
               (ఇస్లామిక్‌ గైడెన్స్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో)

మీ ప్రభు వైపునకు మరలండి



తల్లిదండ్రులు, బంధుమిత్రులు, పొరుగువారు, అతిథుల పట్ల సద్వ్యవహారం కలిగి ఉండండి. ఒకవేళ జనాలు మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించినా మన్నింపుల వైఖరిని అవలంభించండి. అసభ్యంగా వ్యవహరిస్తే హుందాగా సలాం చేసి తప్పుకోండి. ఎట్టి స్థితిలోనూ ఎవ్వరితోనూ కయ్యానికి కాలు దువ్వకండి. సిగ్గుమాలిన పోకడల జోలికి వెళ్ళకండి. సారాయి, జూదం, వ్యభిచారం, పాచికల జోస్యం సమాజాన్ని భ్రష్టు పట్టించే, సంసారాన్ని నట్టేట ముంచే మహా భయంకర వ్యసనాలు. వీటికి దూరంగా మసలుకోండి. ఇదంతా ఎక్కడ నేర్చుకుని చెబుతన్నాడు? అంటారా-; ఇస్లాం ధర్మం నాకు నేర్పిన నైతిక విధానం ఇది. ఇది అన్నీ మతాల్లో ఉన్న అంశాలే కదా అని మీరు అనవచ్చు. నిజమే-, కానీ ఇస్లాంలో ఇలాంటి సమాజానికి పనికివచ్చే హితోక్తులు పరిపూర్ణంగా ఉన్నాయి అని నేనంటాను.
  ఒకప్పుడు నేనూ అందరిలా ఇస్లాం అంటే ఒక ప్రాంతానికి, భాషకి సంబంధించిన మతం అని, అల్లాహ్‌ అంటే కేవలం ముస్లింల దేవుడని, ఖుర్‌ఆన్‌ అంటే ఏదో కొద్దిమంది మత విశ్వాసాలకు సంబంధించిన గ్రంథమని, మహా ప్రవక్త ముహమ్మద్‌ అంటే  అరబ్బు ప్రాతానికి పరిమితమైన ప్రవక్త అని, చివరికి ముస్లిలు అంటే మహమ్మదీయులని (ముహమ్మద్‌ ప్రవక్తను ఆరాధించేవాళ్ళని) అనుకునేవాణ్ణి. కానీ నా అభిప్రాయం తప్పని పుస్తకాలు చదివిన మీదట తెలిసింది. మహా ప్రవక్త (స) వారి జీవిత చరిత్ర ద్వారా మనిషి ఎలా జీవించాలో తెలుసుకున్న నేను, ఖుర్‌ఆన్‌ గ్రంథ పారాయణం ద్వారా జీవితం – జీవితంలోని కష్ట సుఖాలు, మరణం-మరణం తర్వాతి జీవితం పరలోకం, తీర్పు దినం, స్వర్గం, నరకం మొదలైనవి గ్రహించగలిగాను.
  ‘తమ పాపాలపై పశ్చాత్తాపం చెందేవారిని పరిశుద్ధతను, పరిశుభ్రతను పాటించేవారిని అల్లాహ్‌ అమితంగా ప్రేమిస్తాడు”.
 (అల్‌ బఖరా: 222) అన్న మోక్ష సౌరభాలు నిండిన శుభవార్త ఖుర్‌ఆన్‌ లోనిదే. ఇస్లాం కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలో కూడా నేర్పుతుంది అంటే మీరు నమ్ముతారా? చూడండి!
1) మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ముందు ఎడమ కాలు పెట్టి లోనికి ప్రవేశిస్తూ ”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్‌ ఖుబ్‌సీ వల్‌ ఖబాయిస్‌” అనాలి.
2) నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోగానీ, నీడనిచ్చే చెట్ల క్రిందగానీ, జనులు నడిచివెళ్ళే రహదారుల్లోగానీ, మల మూత్ర విసర్జన చేయకూడదు.
3) పిడకలతో, ఎముకలతో ఇస్తిన్జా చేయకూడదు. అలాగే రంద్రాల్లో, బిలముల్లో మూత్రం పోయకూడదు.
4) మైదాన ప్రదేశాల్లో కాలకృత్యాలకై వెళితే ఏదైనా వస్తును తెరగా పెట్టుకోవాలి.
5) అనివార్య పరిస్థితిలో తప్ప ఎప్పుడూ మూత్ర విసర్జన కూర్చోనే చేయాలి.
చూశారుగా ఇస్లాం చూపే జీవన సంవిధానం. త్వరపడిండి. నిజ ధర్మమేదో తెలుసుకోండి. మీ ప్రభు వైపునకు మరలిపోండి. ఆయన ప్రసన్నతను చూరగొని స్వర్గవనాలలో హాయిగా విహరించండి.

చీకటి నుండి వెలుగు వరకు


అరబ్బులందరిని క్రైస్తవులుగా మార్చాలనుకున్న సదరన్‌ బాప్టిస్ట్‌ యువతి, ఒక కంప్యూటర్‌ మిస్టిక్‌ వలన సత్య ధర్మంలోకి అడుగిడి, 32 సంవత్సరాలుగా అమెరికాలోని క్రైస్తవులను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్న ఈమె 1975లో అస మాన సామర్థ్యమున్న బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌. అవార్డులను గెలుచుకుంటూ, సొంత వ్యాపారాన్ని చూసుకునే ఈమె జీవితం ఓ విచిత్రమైన మలుపు తిరిగింది.
”నేను ముస్లింనని చెప్పుకోవడానికి సంతోష పడుతున్నాను. ఇస్లాం నా జీవితం. ఇస్లాం నా గుండె చప్పుడు. ఇస్లాం నా రక్త నాళాలలో ప్రవహించే రక్తం. ఇస్లాం నా బలం. ఇస్లాం నా అద్భుతమైన, అందమైన జీవితం. ఇస్లాం లేకుండా నేను లేను. అల్లాహ్‌ా తన చూపుని నా వైపు నుండి త్రిప్పితే నేను బ్రతకలేను.” అని చెప్పిన ఈ సోదరి ఇస్లాం కోసం ఎన్నో త్యాగాలను అల్లాహ్‌ాపై విశ్వాసంతో సునా యాసంగా చేసి, 16సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరకు తన జీవితంలో కోల్పోయినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ యిన దానిని సాధించి తోటి ముస్లింలకు ఆదర్శమయిన  సోదరి అమీన అస్సిల్మి యొక్క జీవిత కథను ఈ నెల అందిస్తున్నాం.
ఆమినా మొదటిసారి ముస్లిములను కలసిన ప్పుడు, రిక్రియేషన్‌లో ఆమె డిగ్రీ పూర్తి కావ స్తుంది. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే తీసుకు బోయే కోర్సు గురించి ముందుగానే రిజిష్టర్‌ చేసుకోవచ్చు. ఆ విధంగా రిజిష్టర్‌ చేసుకుని తన పనులు చూసుకోవడానికని ఓక్లహామా వెళ్ళారు. ఆ వ్యవహారాలు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్ట డం వలన, స్కూలుకి ఆలస్యంగా రావడం జరి గింది. ఇక ఇప్పుడు ఏదైనా ఓ కోర్సుని డ్రాప్‌ చేసుకోవడానికి అవకాశం లేదు.  మిస్సయిన వర్క్‌ని అందుకోవడంలో ఆమెకి కంగారుపడ వలసిన అవసరం లేదు. క్లాసులో, తన సబ్జెక్ట్‌ లో  టాప్‌ ర్యాంక్‌లో ఉంటూ, ప్రొఫెషనల్స్‌తో కూడా పోటీ పడీ చాలా అవార్డులు గెలుచుకు న్నారు. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఆమెకున్న అమితమై సిగ్గుబిడియాల కారణంగా ఇతరుల తో చాలా తక్కువుగా మాట్లాడేవారు. ఎవరితో నైనా మాట్లాడటం చాలా అరుదు.  బాగా అవ   సరమైతేనే మాట్లాడేవారు లేదా తెలిసినవారి తోనే మాట్లాడటానికే ఇష్టపడేవారు. ఆమె తీసుకునే క్లాసులు ఎడ్మినిస్ట్రేషన్‌,సిటీ ప్లానింగ్‌, పిల్లల ప్రోగ్రామింగ్‌ మొ:వి. కాని ఆమె ఎక్కువగా హాయి పొందేది పిల్లలతోనే. సరే, కథలోకి వెనెక్కి వెళితే…..
కంప్యూటర్‌ ప్రింటవుట్‌ ఆమెకో షాక్‌ ఇచ్చింది. ఇంతకి తాను రిజిస్టర్‌ చేసుకున్నది ఓ థియేటర్‌ క్లాస్‌ (అంటే పొరపాటున, థియేటర్‌ క్లాసుగా రిజిస్టర్‌ అయ్యింది.) థియే టర్‌ క్లాసంటే ప్రత్యక్షంగా, మనుషుల ఎదురు గా ప్రదర్శించవలసి ఉంటుంది. క్లాసులో ఓ ప్రశ్నను సహితం అడగలేని ఆమె, ప్రజలెదు రుగా స్టేజి మీదికెళ్ళడానికి భయపడింది.
ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆమె భర్త, ఆమె సమస్యను క్లాస్‌ టీచర్‌కు వివరించమని సలహా ఇచ్చారు. ఈ విషయం నుండి ఆమెను బయటపడేలా చేయడానికి టీచర్‌ ప్రయత్ని స్తానని భరోసా ఇచ్చింది. కాబట్టి క్లాసుకు వెళ్ళారు. అయితే ఆమెకి రెండవ షాక్‌ ఏమిటంటే, క్లాసు పూర్తిగా అరబ్బులతో నిండి ఉండటమే. ఎప్పుడు అరబ్బులను ప్రత్యక్షంగా చూడని ఆమెకు క్లాసులో ఓ సమూహమే కని పించే సరికి,వారిపై తనకుండే ద్వేషం దురభి ప్రాయల వలన, క్లాసులో కూర్చోకుండా ఇంటి కి వెళ్ళి పోయింది.  ఆమె చెప్పారు ”ఈ సందర్భంలో మీరు ఓ విషయాన్ని తెలుసుకోవాలి. నేను లెదర్‌ హట్‌ ఫ్యాంట్‌ తీసుకుని, పై భాగాన తాళ్లతో కట్టుకునే టాప్‌ను ధరించి, చేతులలో  మందు గ్లాసుతో ఉన్న నా లాంటి మహిళకు (నా మనస్సుకు నాకంటే ఆ) అరబ్బులే చెడ్డవారిగా అనిపించారు.”
ఇక క్లాసుకు మళ్ళి వెళ్ళే ప్రసక్తి లేదని ఆమె తన భర్తతో చెప్పినప్పుడు, ఆయన తన సహజ ప్రశాంత ధోరణిలోనే స్పందించారు. ప్రతీ దానికి దైవం ఏదో ఓ కారణాన్ని ఉంచుతారనే విషయాన్ని భర్తకు ఎప్పుడూ ఈమె చెబుతూ ఉండేది. ఆ విషయాన్నే ఆమెకు గుర్తు చేసి, చివరి నిర్ణయం తిసుకునే ముందు, కొంత సమయం తీసుకుని, బాగా ఆలోచించుకోమని చెప్పారు. అంతే కాకుండా ఆమెకున్న స్కాలర్‌ అవార్డు వలన ట్యూషన్‌ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అది నిలబెట్టుకోవాలంటే క్లాసుకెళ్ళడం తప్పదు మరి.
ఆ తరువాత రెండు రోజులు ఏదైనా మార్గం చూపించమని దైవాన్ని ప్రార్థించింది. నరకాగ్ని నుండి ఈ బుద్ధిహీనుల్ని (అప్పటి ఆమె ఉద్దే శంలో అరబ్బులని) రక్షించడానికే దైవం ఆమెను ఈ క్లాసులో ఉంచడం జరిగిందని, తనకు తానే సర్ధి చెప్పుకుని తిరిగి రెండు రోజు లకు క్లాసుకు వెళ్ళింది.
క్లాసులో, జీసెస్‌ను వారి వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించకపోతే, వారు తమ పరలోక జీవి తమంతా నరకాగ్నిలోనే కాలుతుంటారని ఆమె వివరించి చెప్పినా సరే, వారు మాత్రం చాలా మర్యాద చూపారే గాని, క్రైస్తవాన్ని స్వీకరించ లేదు. తరువాత జీససెస్‌ వారిని ఎలా ప్రేమిం చాడో, వారి పాపాలనుండి కాపాడటానికి శిలు వపై ఎలా మరణించాడో వివరిస్తూ, వారు మనస్ఫూర్తిగా అంగీకరించాలని చెప్పినా, తిరిగి వారు మర్యాద చూపారే కాని ఇంకనూ క్రైస్తవాన్ని స్వీకరించలేదు. కాబట్టి వారి స్వంత గ్రంథాన్ని చదివి, దాని ద్వారానే ‘ఇస్లాం వాస్తవ ధర్మం’ కాదని మరియు ముహమ్మద్‌ (స) ‘వాస్తవ దైవం’ కాదని వారికి   నిరూపిం
చాలనే నిర్ణయానికొచ్చింది. (క్రైస్తవులు,  ప్రవక్త ‘ఈసా'(అ)ను దైవంగా పూజిస్తారు కాబట్టి ముస్లిములు కూడా ముహమ్మద్‌ (స) వారిని దైవంగా పూజిస్తారని అప్పట్లో ఆమె భావించేవారు).
విద్యార్థులలో ఒకతను ఆమెకు ఒక ఖుర్‌’ఆన్‌ ప్రతిని, ఇస్లాం గురించి తెలియజేసే మరో పుస్తకాన్ని ఇచ్చాడు. ఆమె పరిశోధనను మొదలు పెట్టారు. తనకవసరమైన ఆధారం చాలా తొందరగా దొరుకుతుందనే నమ్మకం తోనే, ఆమె ఖుర్‌’ఆన్‌ను, రెండవ పుస్తకంతో పాటుగా, 15 ఇతర పుస్తకాలను మరియు సహీ ముస్లిం హదీసులను చదివాక, మరలా ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని చదవడం ప్రారంభిం చారు. అయితే అరబ్బుల నందరినీ క్రైస్తవులు గా మార్చాలనే పట్టుదల మాత్రం ఆమెలో అలాగే ఉంది. ఆమె చదువు మరో సంవత్సర మున్నర కొనసాగింది.
ఈ సమయంలో, ఆమెకు భర్తతో సమస్యలు మొదలయ్యాయి. ఇస్లాం అధ్యయనం వలన ఆమెకు తెలియకుండానే ఆమెలో వస్తున్న చిన్న మార్పే ఆయనని బాధించసాగింది. వారిద్దరూ ప్రతీ శుక్రవారం మరియు  శని వారం బార్‌కి లేదా పార్టీలకి వెళ్ళేవారు. అంతకు ముందరిలాగ బార్‌కి వెళ్ళే కోరిక ఇప్పుడు ఆమెలో లేదు. ఆమె చాలా నిరాడం బరంగా మారింది. ఆమెకు తెలియకుండానే, ఆయన మనస్సుకు దూరం అవుతూ వుంది. తన భార్యలో వస్తున్న మార్పుని అతను మరోలా ఆర్థం చేసుకుని, ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందేమోనన్న అనుమానం తో, ఆమెను బయటికి వెళ్ళగొట్టాడు. పిల్లలతో పాటు ఓ అపార్ట్‌మెంట్‌లోకి మారింది. కాని ముస్లింలను క్రైస్తవులుగా మార్చాలనే కృషి, పట్టుదల ఆమెలో అలాగే ఉన్నాయి.
ఆమె చెప్పిన వర్ణన ప్రకారం, ఒక రోజు తెల్లటి పొడవైన నైట్‌గౌన్‌ లాంటిది ధరించి, తలపై ఎరుపు, తెలుపు గడులున్న టేబుల్‌ క్లాత్‌ లాంటిది ధరించిన ఓ వ్యక్తి ఆమె తలుపు తట్టాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు పైజమాలు ధరించిన వారున్నారు (వారి సాంప్రదాయ దుస్తుల్ని చూడటం ఆమెకి అదే మొదటిసారి). రాత్రి వేసుకునే దుస్తులు లాంటి బట్టలతో కనిపిస్తున్న మగ వాళ్ళని చూశాక, తనకి చాలా కోపం వచ్చింది. ‘నన్ను ఎలాంటి ఆడదాన్ననుకుం టున్నారు వీళ్ళు? వీరికి సభ్యతాసంస్కారం లేదా? అని లోపల అనుకుంటుండగా, ఆమె  షాక్‌ను అర్థం చేసుకున్న, టేబుల్‌ క్లాత్‌ను ధరించిన వ్యక్తే ముందుగా మాట్లాడాడు. ఆమె ముస్లిం కావాలని కోరుకుంటుందనే విషయం తనకు తెలిసిందని చెప్పాడు. తను ముస్లిం కావాలని కోరుకోవడం లేదని, తనొక క్రిస్టి యన్‌నని చెప్పారామె. అయినప్పటికిని, వారికి సమయముంటే, ఇస్లాంపై తను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నట్లు కూడా తెలియ జేశారామె. అతని పేరు అబ్దుల్‌ అల్‌-షేఖ్‌. ఆమెతో చర్చించడానికి సిద్ధమన్నాడు. అతని లోని సహనాన్ని ఆమె గుర్తించింది. ప్రతీ ప్రశ్నను ఆమెతో చర్చించాడు. ఆమె ఎప్పుడూ మూర్ఖంగా ఫీలయ్యేలా గాని, ఆమె అడిగిన ప్రశ్న బుద్ధిహీనమైనదనిగాని ఎప్పుడూ చెప్పలేదు. ‘ఆరాధ్యుడు ఒక్కడే’ అని నమ్ముతు న్నావా? అని అడిగాడు. ఆమె ‘ఔను’ అని సమాధానమిచ్చారు. తరువాత ముహమ్మద్‌ (స) దైవ సందేశహరుడు అని నమ్ముతు న్నావా? అని అడిగాడు. మరలా తను ‘ఔను’ అని సమాధానమిచ్చారు. ఆమె అప్పటికే ముస్లిం అయిపోయినట్లు ఆయన తేల్చి చెప్పేసారు.
తను ఇస్లాంను అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నానని, తను క్రిస్టియన్‌ నని వాదించారు. (అయితే ఆమెలో ఆలోచన మొదలైంది – ‘నేను ముస్లింని కాగలనా? నేను ఓ అమెరికన్‌ని మరియు వాది తెల్లజాతి! నా భర్త ఏమంటాడు? నేను ముస్లింనైతే, నా భర్తకు విడాకులివ్వవలసి వస్తుందే, అయ్యో! నా కుటుంబం నాశనమైపోతుందే!?’)
వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ‘జ్ఞానాన్ని సంపాదించడం మరియు ఆధ్యాత్మి కతను అర్థం చేసుకోవడమనేది నిచ్చెన ఎక్కు తున్నంత స్వల్పమైనదని, నిచ్చెన ఎక్కేటప్పుడు, నిచ్చెన అడ్డుకర్రలు కొన్నింటిని దాటాలని ప్రయత్నించినప్పుడు, పడిపోయే ప్రమాద ముందని చెప్పుకొచ్చాడాయన.
‘షహాదా’ (అంటే దేవుడు ఒక్కడే అని, ముహ మ్మద్‌(స) అల్లాహ్‌ా యొక్క సందేశహరుడు అని  ప్రకటించడం) కేవలం నిచ్చెన పైన వేసే మొదటి అడుగు మాత్రమేనని’ ఆయన వివరించారు.

చర్చీల నుండి మస్జిద్‌ల వైపునకు


తండ్రి = కుమార = పరిశుద్ధాత్మ. ”3=1 ఎలా అవుతుంది?” తీవ్రంగా ఆలోచించారు.
  తన ఆలోచన ఈ విధంగా ఉంది: ”3=1 అంటే అర్థం వారిది ఒకే స్థాయి, అదే శక్తి మరియు అదే తత్వం (నీటికి మూడు వేర్వేరు స్థితులున్నాయి) 1) ద్రవం 2) ఘనం 3) వాయు స్థితులు మరియు 1లో 3 అంటే, ఒకే కుటుంబంలోని ముగ్గురికి ఇంటి పేరు ఒకటే ఉంటుంది. కాని వారు పూర్తి వేర్వేరుగా, వేర్వేరు మనస్తత్వాలను, వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు”. 
  ఆమెలో ఆలోచన తీవ్రమైంది. ”దేవున్ని ముగ్గురుగా విశ్వసిస్తే నేను ఒక సృష్టినే ఎందుకు కలిగి ఉన్నాను? ఉదాహరణకు నేను ముగ్గురు ఆర్టిస్టులతో చెట్టు బొమ్మ గీయమని చెబితే, ఒక్కొక్కరు వారి శైలి (స్టయిల్‌) ప్రకారం మరియు వారి ఆలోచన ప్రకారం (ఒక్కొక్కరు ఒకో రకంగా) చెట్టు బొమ్మను వేస్తారు. ఒకే దైవంలో ఉన్న 3గురు, ఒకే ప్రాణిని సృష్టిస్తే, ఒక్కొక్కటి వేర్వేరుగా సృష్టించబడుతుంది. వారిది ఒకే ఉద్దేశ్యమయినప్పటికినీ, వారు వారి సొంత పద్ధతిలో వాటిని సృష్టిస్తారు”. రుబా ఖేవర్‌కి అర్థమవుతూ ఉంది. ఏదైతేనేం, ‘బైబిల్‌లో కొన్ని పరస్పర విరుద్ధ విషయాలు ఉన్నాయనే’ భావన ఆమెలో కలిగింది.
”ఈ పుస్తకం నాకు ఎక్కడి నుండి వచ్చింది’ జీసెస్‌ తనకు తానే స్వయంగా దేవుని కుమారుడుగా చెప్పుకున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన యూద జాతివారే. యూదులు తాము ”దేవుని బిడ్డలు’గా చెప్పుకోవడం అనేది కొత్త విషయమేమీ కాదు. వారంతా మానవులే కదా!” ఆమెలో ఆలోచన తీవ్ర రూపం దాల్చి, కొనసాగుతూనే ఉంది.
జీసెస్‌ స్వయంగా ప్రార్థించారు? 
ఎవరిని ఆయన ప్రార్థించారు? తనకు తానే ప్రార్థించుకున్నారా? గ్రంథంలో చాలా చోట్ల ఆయన ప్రార్థించినట్లు ఉంది”. ఈ సందర్భంగా ఆమె బైబిల్‌ నుండి చాలా వాక్యాలను ఉదాహరించారు. వీటికి తోడు, ఆమెకు ఓ విషయం మెరుపులా జ్ఞాపకం వచ్చింది. క్రైస్తవ ధర్మశాస్త్రం గురించి ఆమె అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక బ్రిటిష ప్రొఫెసర్‌ ఆమె చదివే కాలేజికి వచ్చారు. బైబిల్‌ వ్రాత ప్రతుల చరిత్ర గురించి ఆయన వారికి బోధించేవారు. ఆమెకు జ్ఞాపకం వచ్చింది…ఆయన ఖచ్చితంగా ఏమన్నాడంటే, ”మంచిది…బైబిల్‌ వ్రాత ప్రతులను చూడటానికి నేను ఇంగ్లాండ్‌లోని మ్యూజియంకి వెళ్ళాను. నేను అక్కడ చూసినవి అన్నీ కూడా చిరిగిపోయి, కొంత భాగం మిగిలిన కాగితాలు ఆ ప్రదేశమంతా పరచబడి ఉన్నాయి”. ”మరియు వారు (యూదులు) ‘నిశ్చయంగా, మేము అల్లాహ్‌ా యొక్క సందేశహరుడు, మర్యమ్‌ కుమారుడైన ‘ఈసా’ మసీహ్‌ా (ఏసుక్రీస్తు) ను చంపాము’ అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు. కాని వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. వాస్తవానికి అల్లాహ్‌ా అతనిని (ఈసాను) తన  వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్‌ా సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు”. (దివ్య ఖుర్‌ఆన్‌ 157,158)
 ”అంటే జీసెస్‌ను చూసినవారు, నిజానికి జీసెస్‌లా ఉండే మరొకరిని చూశారు” అనే నిర్ణయానికి వచ్చారామె. అంటే మన చేెతులలో ఉన్నది వ్యక్తిగత విషయాలు మాత్రమే. అందులోని 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్చబడినదేనని తెలుసుకున్నారు. ఇప్పుడు ఫలితం నా చేతుల్లో ఉంది”. ”జీసెస్‌ దేవుడు కాదు, కనీసం దేవుని కుమారుడు కూడా కాదు. నేను భయపడ్డాను, నాలో దిగులు మొదలైంది. ఇన్ని సంవత్సరాలు… నా జీవితంలోని 24 సంవత్సరాలలో నేను అధ్యయనం చేసింది ఓ ‘థీరీ’నా!
24 సంవత్సరాలపాటు అవాస్తవ దైవాన్ని ఆరాధించానా?
24 సంవత్సరాలు ఓ అబద్ధంగా గడిచాయా?”
”నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. నేను నిలుచున్నా నా క్రిందున్న భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. నేను చాలా భయపడ్డాను”. నాకు వచ్చిన ఫలితాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించడానికి, నేను మరలా వెనక్కి, అంటే ప్రారంభం నుండి నా అన్వేషణను మరలా ప్రారంభించాలనుకున్నాను… నేను చాలా మౌనంగా గడిపాను… తర్వాత ఏమిటో తెలియదు! నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను. ఇలా తన మనసులో జరిగిన అలజడిని తెలియజేశారు.
ఇంకా ఇలా చెబుతున్నారు: ”నేను ఆలోచించడం ప్రారంభించాను. జీసెస్‌పై నాకు విశ్వాసం ఉంది. ఆయన ఓ మనిషి మాత్రమే. అతను దైవం యొక్క ప్రవక్త. నేను ప్రవక్తలందరినీ విశ్వసిస్తున్నాను… ముహమ్మద్‌ (స) వారి విషయంలో నాకొక సమస్య ఉంది. నేను ఎప్పుడూ ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోలేదు. కాని నాకు తెలిసిందేమిటంటే, నా మనస్సులో క్రైస్తవులు ఏదైతే నాటారో అది మాత్రమే… కాని ఆయనని ప్రజలందరూ గొప్ప ప్రవక్తగా ఎలా పొగడగలుగు తున్నారు?”   నేను చెప్పాను…”ఇది సమస్య ఎలా అవుతుంది. దివ్యగ్రంథమైన ఖుర్‌ఆన్‌ ఆకాశం నుండి ఆయన (స) పై అవతరించింది. ఆయన నిజంగా ప్రత్యేకమే అయి ఉండాలి… అంటే ఉన్న ప్రవక్తలతో పాటు మరొక ప్రవక్తను కూడా విశ్వసించడం పెద్ద సమస్యేమీ కాదు…”
”దీనికితోడు, ‘బర్నాబీ’ అనే పేరుతో పిలువబడే మరో సువార్త ఉందని, దానిని చట్ట విరుద్ధమని, చర్చ్‌లు ఆ ‘సువార్త’ను విశ్వసించరని నాకు తెలుసు. ఎందుకంటే అందులో జీసెస్‌, తన తరువాత అహమద్‌ అని పిలువబడే ప్రవక్త రానున్నారని చెప్పారు”. 
  ”నేను బాగా ధ్యానం చేసుకున్నాక నా రూమ్‌ నుండి బయటికి వచ్చాను. దాని గురించే ఆలోచించడం…అన్వేషించడం…” రెండు నెలల నుండి రుబా తన స్నేహితులను కలవలేదు. వారికి ఫోన్‌ చేశారు. వారిని వారింటి దగ్గర ఆమె చూడాలను కున్నారు. ‘రుబా’ అల్ల్లాహ్‌ాను ప్రార్థిస్తూ రోదించారు.
నేను అనుకున్నది సన్మార్గమయితే, నీవు నా జీవితాన్ని మార్చు… ఒకవేళ అది కాకపోతే ఇప్పుడే నన్ను ఏదైనా యాక్సిడెంట్‌లో నా స్నేహితుల్ని చేరేలోపు చనిపోనివ్వు. నన్ను స్వర్గానికి తీసుకుపో. నేను సత్యం కోసమే చూస్తున్నాను. ఏం జరిగినా నన్ను స్వర్గానికి తీసుకు పొమ్మని అర్థిస్తున్నాను”. 
ఆ విధంగా నీళ్ళు నిండిన కళ్ళతో తన స్నేహితుల్ని చెరుకున్నారామె. ఆమె కళ్ళలో నీళ్ళు చూసి, ఏదో జరిగి ఉంటుందని వారనుకున్నారు. ”అక్కడే నా భర్త ఉన్నాడు” (వాదించడానికి)…(అప్పటికింకా వీరిద్దరికి పెళ్లి కాలేదు).
 ”ఏం జరిగిందో నేను చెబుతానని వారు ఎదురు చూస్తున్నారు. నేను చెప్పాను ”అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్‌ రసూలుల్లాహ్”( నేను సాక్ష్యమిస్తున్నాను ‘ఆరాధ్యుడు లేడు అల్లాహ్  తప్ప’. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ‘ముహమ్మద్‌ (స) వారు అల్లాహ్‌ా యొక్క సందేశహరులని”.) 
సోదరి పలికిన మాటలు విని, రెండు నిమిషాలపాటు వారంతా ఏ మాటా లేకుండా నిశ్శబ్ధంగా ఉండిపోయారు. వారు ఆమె  వంక చూశారు. ఆ యువకుడు (ఆమె భర్త) విచిత్రంగా నవ్వడం ప్రారంభించాడు. అతనే అన్నాడు: ”షటప్‌… అబద్ధం చెప్పకు”.
 ”షట్‌ అప్‌… అబద్ధం చెప్పకు”
ఆ రోజు అక్టోబర్‌ 3 అనుకుంటాను, రుబా గుర్తు చేసుకున్నారు. 
”నేను అబద్ధం చెప్పడం లేదు” అంటూ ఏడ్వడం మొదలెట్టాను.
విశ్వాసం లేకుండా షహాదా (సాక్ష్య వచనం) చెబితే అది (ఆ షహాదా) ముస్లిం కానివ్వదు అంటూ ఆ రోజు నువ్వే కదా చెప్పావు అని గుర్తు చేస్తూ, అబద్ధం చెప్పవద్దన్నాడు.  ”నేను అబద్ధం చెప్పడం లేదు… రేపు రమజాన్‌ మొదటి రోజు…నీవు నాకు నమాజు ఎలా చేయాలో నేర్పబోతున్నావు. అలాగే ఇంకా ప్రతీ విషయమూనూ” అని రుబా అన్నారు. 
నేను అలా చెప్పగానే…బేబీలాగా అతనికి కూడా ఏడుపు వచ్చింది.  నిజంగా ఒక్క రాత్రిలోనే నేను అవన్నీ నేర్చుకున్నాను…హిజాబ్‌ ఒకటి కొన్నాను.. నా స్నేహితురాలు దాన్ని ఎలా ధరించాలో అన్నీ వివరంగా తెలిపింది. నా ఇస్లాం గురించి (ఇంటిలో) రెండు వారాల పాటు దాచాను. 
 ఆ సమయంలోనే, నేను ఇమామ్‌ దగ్గరికెళ్ళి షహాదా పలికాను. ఖుర్‌ఆన్‌ నుండి నేర్చుకోవడం మొదలు పెట్టాను. రెండు గ్రంథాలనూ పోల్చి చూసేదాన్ని. ప్రారంభంలో బైబిల్‌ వదలడానికి చాలా కష్టంగా అనిపించింది. అల్‌హమ్‌దులిల్లాహ్  (కృతజ్ఞతలన్నీ అల్లాహ్కే). ఇప్పుడటువంటి దేమీ లేదు. 
  ఆమె ఇస్లాం స్వీకరించిన విషయాన్ని ఆమె కుటుంబానికి తెలియకుండా దాచారు. రాత్రి 2 గంటల నుండి 3 గంటల మధ్య నమాజు చేసుకునేవారు. ఆ సమయంలో అనుమానంతో తను చేసేది ఎవరూ చూడలేరని అలా చేసేవారు. 
     ఆమె ఖుర్‌ఆన్‌ మరియు హిజాబ్‌ను స్కూలుకి తీసుకెళ్ళి సంచిలో ఉంచుకొనే వారు. ఓ రోజు స్కూల్‌కి వెళుతున్నప్పుడు, ఆమె వీపుకి తగిలించుకున్న సంచిలో నుండి అనుకోకుండా ఆమె హిజాబ్‌ ఇంటిలోని మెట్ల మీద పడిపోయింది. ఆమె వెనుక చెల్లుంది. ఆమె చెల్లెలు చూసింది కాని ఆమెకి ఏమీ తెలియలేదు. రాత్రి లేచి రుబా నమాజు చేయటం చూసే వరకు ఆమెకి విషయం అసలు అర్థం కాలేదు. రుబా చెల్లెలు కుటుంబ సభ్యుందరికీ ఈ విషయాన్ని చెప్పేసింది. అప్పుడొచ్చింది సమస్య. 
  వారు తనపై అరిచారు, అవమానించారు, ఘోరమైన భాషలో ఆమెనెన్నో మాటలన్నారు. చచ్చేలా కొట్టారామెను. జడిపించారు కూడా. అంత జరిగినా ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ వారందరినీ ఇస్లాం వైపు తీసుకురమ్మని అల్లాహ్ను ప్రార్థిస్తూ రుబా ఇల్లు వదలి వచ్చేసింది. 
 ఆమె ముస్తఫాను వివాహం చేసుకునే వరకూ… రెండు నెలల పాటు తన స్నేహితు రాలి దగ్గరే ఉన్నారు… అల్‌హమ్దులిల్లాహ్!
   నేను నా కుటుంబాన్ని వదులుకున్నాను. కాని మస్జిద్‌ దగ్గర్లో మరో కొత్త ముస్లిం కుటుంబం నా గురించి శ్రద్ధ తీసుకుంది. అంతే కాదు, నిజంగా నాకు ఎంతో సాయం చేశారు. కృతజ్ఞతాభావంతో గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల గురించి ఇలా చెప్పారు:
  నన్ను కొట్టిన దెబ్బల వలన….ఆ తరువాత నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఇప్పటికీ ప్రపంచ నలు మూలల నుండి కూడా కనీసం 25 ఫోన్‌ కాల్స్‌ మరియు ఈ – మెయిల్స్‌ వస్తూ ఉంటాయి. అవమానిస్తూ, బెదిరిస్తూ. 
    నాకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ మాత్రమే కాకుండా, జోర్డాన్‌ మరియు అమెరికాలోని పెద్ద పెద్ద క్రైస్తవ ప్రొఫెసర్స్‌తో ఫోన్‌ వాదనలు కూడా జరిగేవి…మతాల గురించి వాదిస్తూ, నన్ను తిరిగి వెనక్కి క్రైస్తవంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ…” సుబ్‌హానల్లాహ్  (అల్లాహ్  పవిత్రుడు) నేను నా చేతుల్తో బైబిల్‌ని పట్టుకుని ఉండేదాన్ని కానీ వారి చేతిలో ఖుర్‌ఆన్‌. కథ అడ్డం తిరిగింది. 
  ఏదేమైనా, చాలా తక్కువ సమయంలోనే నేను చాలా నేర్చుకున్నాను…. సహనం తోనూ, వినయంగానూ ఉండటం నేర్చు కున్నాను. నేను ఇప్పుడు ధ్యానం చేస్తూ, దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స ) వారికి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తుంటే ఆయన (స )కు ఎన్ని అవమానాలు! ఆయన (స ) వాటన్నింటిని ఎలా భరించారో!….ఆయనతో పోలిస్తే నా కథ అసలు ఏమీ కాదనిపించింది. వావ్‌… నేను చాలా నేర్చుకున్నాను.
 నా కుటుంబం యొక్క ఉన్నత గౌరవాన్ని నేను పోగొట్టుకుని ఉండవచ్చు. అలాగే కొంత మంది దృష్టిలో నాకున్న గౌరవాన్ని కూడా. కాని అల్లాహ్‌ా నుండి వస్తున్న గౌరవానికి నేను గర్వపడుతున్నాను, ఆశ్చర్య పోతున్నాను. మీరసలు ఊహించ లేరు. అలాంటి అవమానాలలో సయితం నేను ఎటువంటి సంతోషం, శాంతితో బ్రతుకుతున్నానో!”
  నిజంగా నేను పూర్వం కంటే చాలా మారిపోయాను. నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని…నా భర్త సయితం ఇది గుర్తించారు.నన్ను ఎల్లవేళలా అవమానించే వారితో సయితం నేను ఎలా మౌనంగా, సహనంతో ఉండాలో నేర్చుకున్నాను.అలాంటి కష్ట కాలాలలో (నా ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు సయితం) ఎలా చిరునవ్వుతో ఉండవచ్చునో నేర్చుకున్నాను. కాని అల్లాహ్  ఆ నష్టాన్ని పూరిస్తున్నాడు.
  ఇదంతా నీ లోపల నిర్బంధ శాంతి కలగాలని…నీవు నిజంగా నీ చుట్టూ ఉండేవారి నుండి శాంతిని కనుగొనలేవు… నీ చుట్టూ ఉండే వాతావరణం వలన గాని… నీ అంగీకారం వలననే, నీ మనస్సు వలననే… (శాంతిని కనుగొనగలవు). నీ మనస్సును అల్లాహ్కు అంకితం చేసి ఆయనను ప్రేమించడం వలననే… నీవు అల్లాహ్ను ఆరాధించినట్లయితే, ఆయన ఆదేశాలను అనుసరించినట్లయితే నీవు ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే, చేసే పాపాలు నిన్ను దోషివనే భావనను కలిగించి, నీ నుండి శాంతిని దూరం చేస్తాయి. 
  నేను కొందరి ముఖాలను, వారి కళ్ళల్లో నీటిని, విచారాన్ని చూశాను. వారంతా సృష్టికర్తకు దూరంగా ఉన్నారు. కొన్నిసార్లు నేను వారి హృదయంలోని చీకటిని చూశాను. వారు అందులోని జ్యోతిని వెలగనివ్వరు. ఎందుకంటే వారు జీవితంలో తలమునకలై ఎన్నో సమస్యలలో చిక్కుకున్నారు”.
  ఇప్పుడు నేను తెలుసుకున్నదంతా – ఈ జీవితంలో నా లక్ష్యం – ఆరాధించడం, అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఆయన ఆదేశాలను, నియమాలనూ అనుసరిస్తూ ఆయన కొరకు మంచి పనులు చేయడం. 
చివరిగా మన ప్రియతమ సోదరి ఇలా అన్నారు:
  ”మీ ఆత్మకు బలంగా నా ఈ కథను మీరు ఎంజాయ్‌ చేసి ఉంటారని నేనను కుంటున్నాను. అసలైన సత్యాన్ని కనుగొన్న సోదరి ‘రుబా డి.ఖేర్‌’ గురించి మీ కందించే అవకాశాన్ని కల్పించిన అల్లాహ్కు కృతజ్ఞతలు.